కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్న అభివృద్ధికి నోచుకోలేదు...
కూటమి ప్రభుత్వం లో డైవర్షన్ రాజకీయాలు...
బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్రయ్య యాదవ్...
న్యూస్ 21 తెలుగు:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తికావస్తున్న ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బిసివై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం వైయస్సార్ కడప జిల్లా. బద్వేలు నియోజకవర్గం. కాశినాయన మండలం లోని గొంటువారిపల్లె గ్రామానికి ఆయన విచ్చేశారు. ఆయనకు నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని పలువురిని పార్టీలో చేర్చుకున్నారు. ముందుగా పోరుమామిళ్ల నుండి కాశినాయన మండలానికి వెళ్తున్న నేపథ్యంలో బీసీవై పార్టీ పోరుమామిళ్ల ఇన్చార్జి నరసింహులు. మరియు కార్యకర్తలు. అభిమానులు. కలసి బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్రయ్య యాదవ్ కు స్వాగతం పలికారు. అనంతరం రామచంద్రయ్య యాదవ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన గొంటూవారి పల్లెలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ. అధికారంలోకి రాకముందు అన్ని కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా ఇచ్చిన హామీలను మరచి ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి త్వరలో బుద్ధి చెప్పబోతున్నామన్నారు. చంద్రబాబు నాయుడు ఈ 20 నెలల పాలనలో చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. అధికారం వచ్చినప్పటినుండి రాష్ట్ర అభివృద్ధి కోసం ఫలానా అభివృద్ధి చేశామని చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారన్నారు. జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ తరఫున ప్రతి గ్రామంలో అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేపిస్తామన్నారు. ఇప్పటి నుండే గ్రామస్థాయి నుండి బీసీవై పార్టీ అభివృద్ధికి తోడ్పడి రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డి సి వై పార్టీ నాయకులు. కార్యకర్తలు. ప్రజలు కొన్నారు
0 Comments