google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 పోరుమామిళ్ల ప్రాంతంలో జరిగిన దళిత యువకుల మరణాలు ఆత్మహత్యలు కాదు... ప్రేమ వ్యవహార హత్యలే...

పోరుమామిళ్ల ప్రాంతంలో జరిగిన దళిత యువకుల మరణాలు ఆత్మహత్యలు కాదు... ప్రేమ వ్యవహార హత్యలే...

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ...

మృతి చెందిన దళిత యువకుల కేసును పోలీసులు నీరు కార్చకుండా సమగ్రంగా విచారణ జరపాలి...

మృతి చెందిన మరణాల గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్న మందకృష్ణ మాదిగ...

హత్యకు కారణమైన హంతకులను కఠినంగా శిక్షించాలి మందా కృష్ణ మాదిగ డిమాండ్...

న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా. బద్వేలు నియోజకవర్గం.కలసపాడు మండలం లోని ముద్దమారుపల్లి గ్రామానికి చెందిన సగిలి ఇమ్మానియేల్ (16) గత నెల 6  తేదీన పోరుమామిళ్ల మండలంలోని డంపింగ్ యార్డ్ సమీపాన రెడ్డి కథవా లో అనుమానాస్పద మృతి చెందాడు. మృతుడు పోరుమామిళ్ల పట్టణంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.
అదేవిధంగా వైయస్సార్ కడప జిల్లా కాశి నాయన మండలంలోని గంగన్న పల్లె గ్రామానికి చెందిన కందుల దిలీప్ (25) గత నెల 22వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో మార్చి రెండవ తేదీన తిరుపతి సిమ్స్ లో చనిపోయాడు. దిలీప్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ వీరి ఇరువురి కుటుంబాలను పరామర్శించి మృతి చెందిన కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ కాశినాయన మండలంలోని గంగన్నపల్లె గ్రామానికి చెందిన మృతుడు దిలీప్. కలసపాడు మండలంలోని ముద్ద మారుపల్లె గ్రామానికి చెందిన ఇమ్మానియేల్ ది ఆత్మహత్య కాదని. ప్రేమ వ్యవహార హత్య నని ఆయన ఆరోపించారు.పోలీసులు ఈ కేసులను నీరు కార్చకుండా సమగ్ర విచారణ జరిపించి హత్యకు కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

వైయస్సార్ కడప జిల్లాలో హత్యలు ఆత్మహత్యలుగా మారుతున్నాయి... పద్మశ్రీ మందకృష్ణ మాదిగ...

వైయస్సార్ కడప జిల్లా పులివెందులలో వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి గుండెపోటుగా చిత్రీకరించి ప్రచారాలు చేశారని. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. కాశినాయన మండలం గంగనపల్లె. కలసపాడు మండలం ముద్దమారుపల్లి గ్రామాలలో జరిగిన దళిత యువకుల మరణాలు కూడా ఇదేవిధంగా పోలీసులు చిత్రీకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.తెలుగు నేలపై హత్యలు ఆత్మహత్యలుగా.ప్రమాదవశాత్తు జరిగే మరణాలుగా మారతున్నాయంటే అవి కేవలం ఒక్క వైయస్సార్ కడప జిల్లాలోనే జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. అదేవిధంగా దిలీప్ మృతి కూడా కేవలం సెల్ టవర్ ఆధారంగా కాకుండా మరో కోణంలో విచారించాలని ఆయన పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు. ప్రజలు భారీగా పాల్గొన్నారు.

Post a Comment

0 Comments