న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా. బద్వేలు నియోజకవర్గం. పోరుమామిళ్ల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు శీలంశెట్టి లక్ష్మయ్య కువైట్ దేశంలోని కైతాన్ ప్రాంతంలో పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా రెండవ రోజు ఉపవాసంలో పాల్గొన్నారు. శీలంశెట్టి లక్ష్మయ్య కువైట్లో ఉన్న ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవత్వం, సేవా భావం ప్రతి ఒక్కరిలో ఉండాలని తెలిపారు. అదే భావంతో జనసేన పార్టీ కార్యక్రమాలు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్వహించాలని అన్నారు.అలాగే జనసేన పార్టీ 13వ ఆరంభ సభను ఈ సంవత్సరం అధికారికంగా పార్టీ కార్యాలయాల్లో నిర్వహించడం లేదని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో నాయకులు, కార్యకర్తలు కలిసి ఆరంభ సభను నిర్వహించాలని చెప్పారు.ఆరంభ సభ సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ, రక్తదాన శిబిరాలు వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ సేవా సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతి జనసేన నాయకుడు ముందుకు రావాలని శీలంశెట్టి లక్ష్మయ్య పిలుపునిచ్చారు.
0 Comments