ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు హెచ్చరిక...
న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా. బద్వేలు నియోజకవర్గం. పోరుమామిళ్ల ప్రాంతంలో ఇటీవల జరిగిన ఇద్దరు దళిత యువకుల మరణాలపై వెంటనే సమగ్రమైన విచారణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు డిమాండ్ చేశారు. అనుమానాస్పదంగా విద్యార్థి సగిలి ఇమ్మనియెల్ మృత దేహం దొరికిన ప్రాంతాన్ని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం లో జాతీయ, రాష్ట్ర కమిటీ నిజ నిర్ధారణ కమిటీ పరిశీలించడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మార్పియస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగ, ఎమ్మెస్పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వై కే విశ్వనాధ్ మాదిగ, ఎమ్మెస్పి జాతీయ నాయకులు సొట్ట నరేంద్ర బాబు మాదిగ ఎమ్మార్పియస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దుడ్డు రామకృష్ణ మిగతా ప్రధాన నాయకత్వం సంఘటన స్థలాన్ని పరిశీలించి దళిత యువకులు ఇమ్మానుయేల్, దిలీప్ మరణాలపై పలు అనుమానాలు ఉన్నాయని ఇద్దరి దళిత యువకుల మరణాలు హత్యలే అనే అనుమానాలు బలంగా ఉన్నాయాని ఈ మరణాలపై పోలీస్ అధికారులు సమగ్రమైన విచారణ చేసి త్వరిత గతిన నిజాలను సమాజం ముందు పెట్టాలని డిమాండ్ చేశారు..
ఎక్కడ లేని విధంగా దళితుల పై హత్యలు కడప జిల్లా లోనే జరుగుతున్నాయని ఈ మరణాలపై జిల్లా ఎస్పీ. జిల్లా కలెక్టర్ స్పందించి త్వరితగతిన ఈ కుటుంబలకు న్యాయం చేయని చేయని పక్షం లో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం లో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని వారు వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో.మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ నాయకులు చిన్నబాబు, ఓబుళాపురం శోభన్ కుమార్. జిల్లా ఉపాధ్యక్షులు కమలాపురం ప్రసాద్. నియోజకవర్గం అధ్యక్షులు ఓబయ్య.ఎమ్ఈఎఫ్ నాయకులు ఈరి ఆనంద్. గురయ్య. ఆనంద్ రావు.ఈశ్వర్. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్. ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు కె యన్ రాజు. నియోజకవర్గం ఇన్చార్జి గంగిపోగు నరసింహులు. మండల అధ్యక్షులు వీరపోగు రాజేష్. నాయకులు నారిపోగు మనోజ్. రాహుల్. శ్రీనివాస్. తదితరులు పాల్గొన్నారు.
0 Comments