న్యూస్ 21 తెలుగు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రచార విభాగం సంయుక్త కార్యదర్శిగా చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి నియమితులైన సందర్భంగా వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ని మర్యాదపూర్వకంగా గజమాలతో, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ, తనకు ఈ కీలక బాధ్యత లభించడంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ప్రోత్సాహం, మార్గదర్శకత్వం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించిందని తెలిపారు.
పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూ కార్యకర్తలకు దారిదీపంగా నిలుస్తున్న ఆయన నాయకత్వం తమకు ఎల్లప్పుడూ ప్రేరణనిస్తుందని కొనియాడారు. ఇకపై కూడా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆశీస్సులు, మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమిస్తానని, పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కి, ఎంపీఅవినాష్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి కి, జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి కి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ కి, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి గార్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ప్రచార కార్యక్రమాలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ముత్యాల ప్రసాద్, వైస్ ఎంపీపీ రాజశేఖర్, రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర మరియు జిల్లా అనుబంధ విభాగాల నాయకులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రాజీవ్ భాష, చిత్తా గిరి ప్రణీత్ రెడ్డి, కాశి నాయన మండల పార్టీ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, తులసి సురేష్, చిత్తా రాజశేఖర్ రెడ్డి, సిద్ధమూర్తి రాజారెడ్డి, నాగ సుబ్బారెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీలు మహబూబ్ పీర, ఇషాక్, ముత్తుజ, గురప్ప, ఫార్టీ సీనియర్ నాయకులు శ్రీరాములు, ఓబుల్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, మాలకొండయ్య, హరికృష్ణ, పెసల గణేష్, శివ, సుబ్రహ్మణ, రామ లక్ష్మణ్ రెడ్డి,చాపాటి సాయి నారాయణ రెడ్డి మరియు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments