న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా. ఖాజీపేట మండలం,చెముళ్ళ పల్లె పంచాయితీ, చెముళ్ళపల్లె ఎస్సీ కాలనీకి చెందిన కిన్నెర బాలుడు (61) అనారోగ్యంతో కడప రిమ్స్ లో చికిత్సపొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు. బాలుడు మృతదేహన్ని వారి స్వగృహానికి తేవడం జంగింది.వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యo వెంకటసుబ్బారెడ్డి, వైఎస్ఆర్సిపి నేత కేసీ కెనాల్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యo చంద్ర శేఖర్ రెడ్డి లు ఆదివారం ఉదయం వారి స్వగృహంలో కిన్నెర బాలుడు మృతదేహంపై పూలమాలవేసి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తపరిచారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి, ధైర్యం చెప్పారు. మంచి మనిషి బాలుడు మృతి బాధాకరమని రెడ్యo సోదరులు ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నేతలు గ్రామ సర్పంచ్ ములపాకు బుజ్జి, మాజీ సర్పంచ్ వేమిరెడ్డి గురువిరెడ్డి,రెడ్డి భయపురెడ్డి, పోతుగంటి చిన్న దస్తగిరి,రెడ్యo నారాయణ రెడ్డి,మండల వైస్ ప్రెసిడెంట్ నాగ దాసరి అనిల్ తో పాటు పలువురు గ్రామస్తులు, వైయస్సార్ సిపి నేతలు పాల్గొన్నారు.
0 Comments