google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 పశు సంపదతోకుటుంబఆర్థికఅభిరుద్ది...నారిశెట్టి సుప్రజ.

పశు సంపదతోకుటుంబఆర్థికఅభిరుద్ది...నారిశెట్టి సుప్రజ.

న్యూస్ 21 తెలుగు: పశుసంపదతో కుటుంబ ఆర్థిక అభివృద్ధి చెందుతుందని బద్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ అన్నారు. శనివారం వైయస్సార్ కడప జిల్లా కలసపాడు మండలంలోని చింతలపల్లి గ్రామంలో పాడి పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, రైతులకు అండగా నిలిచేందుకు ఏర్పాటుచేసిన ఉచిత  పశు వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా బద్వేల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ మాట్లాడుతూ ​పశువులలో వచ్చే గర్భకోశ వ్యాధులపై రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స చేయించుకోవాలని ఆమె సూచించారు. అదేవిధంగా వ్యాధులను ముందే గుర్తిస్తే పశువుల ప్రాణాలను కాపాడటమే కాకుండా, పాల దిగుబడి పెరిగి రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని ఆయన అన్నారు.శిబిరానికి వచ్చిన పశువులకు నిపుణులైన ఏడి చంద్ర శేఖర్.వెంకటేశ్వరా రావు డాక్టర్లచే ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. ​ప్రభుత్వం అందిస్తున్న ఇటువంటి ఉచిత వైద్య సేవలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలి. పశుపోషణలో శాస్త్రీయ పద్ధతులను పాటించి లాభాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సాధనకారి రంతు. ఏఎంసి  డైరెక్టర్ సెట్టెం ప్రతాప్.కలసపాడు మండల టీడీపీ నాయకులు. బీజేపీ.జనసేన. నాయకులు మార్కెట్ యార్డ్ కమిటీ సిబ్బంది. అధికారులు.రైతులు.గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments