google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 పేద ప్రజల అభివృద్దే టిడిపి ధ్యేయం.. ఎంపిటిసి కల్వకూరి రమణ.

పేద ప్రజల అభివృద్దే టిడిపి ధ్యేయం.. ఎంపిటిసి కల్వకూరి రమణ.

పేద ప్రజల అభివృద్దే టిడిపి ధ్యేయం.. ఎంపిటిసి కల్వకూరి రమణ.

న్యూస్ 21 తెలుగు: పేద ప్రజల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ధ్యేయమని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు. రంగసముద్రం ఎంపీటీసీ కల్వకూరి రమణ పేర్కొన్నారు. ఆదివారం వైయస్సార్ కడప జిల్లా. బద్వేలు నియోజకవర్గం. పోరుమామిళ్ల పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ దగ్గర తెలుగుదేశం పార్టీ  44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రంగసముద్రం ఎంపీటీసీ కల్వకూరి రమణ ఆధ్వర్యంలో టిడిపి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.సినిమా రంగంలో ఎంతో బిజీగా ఉన్న నందమూరి తారక రామారావు నాటి కాంగ్రెస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు టిడిపిని స్థాపించారన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోనే కాకుండా సినిమాల్లో  కూడా ఎనలేని కీర్తి సాధించారని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని చెప్పారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత టిడిపికి దక్కిందన్నారు. ఎన్టీ రామారావు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాల పెన్నిధిగా నిలిచారన్నారు. మహిళలకు ఆస్తిలో వాటా, రెండు రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మండలాలు, మొదలైన ఏర్పాట్లు చేసిన ఘనత ఎన్టీ రామారావుకి దక్కుతుందన్నారు. ఎన్టీ రామారావు స్ఫూర్తితో రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకు వెళ్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం నూతన వరవడులు సృష్టిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను స్ఫూర్తిగా తీసుకొని తాము కూడా ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకూరి శివకుమార్. గురప్ప స్వామి దేవా స్థానం చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి. రావూరి నాగభూషణం. కల్వకూరి పాపయ్య. చెరుకూరి కేశవ. నాయబ్. నాగేంద్ర. మురళి. సుధాకర్. సురేష్. కిరణ్. బద్రి. యేసురత్నం. మరియు నాయకులు. కార్యకర్తలు. అభిమానులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments