న్యూస్ 21 తెలుగు: వైఎస్ఆర్ కడప జిల్లా. బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణంలోని ఉద్దికట్ట వీధి వాస్తవ్యులు, రిటైర్డ్ టీచర్ పొట్టి గారి వెంకటేశ్వర్లు పరమపదించడం అత్యంత విచారకరం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతి చెందిన వెంకటేశ్వర్లు ఉపాధ్యాయుడి గా అనేక మందికి విద్యాబోధన చేసి, ఎంతో మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన గొప్ప గురువు. అని వారి సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమైనవి. అని ఆయన అన్నారు. ముందుగా ఈ విషయం తెలుసుకున్న బద్వేల్ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగినది.ఈ కార్యక్రమములో వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments