google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 కూటమి ప్రభుత్వంలోనే దళితులపై దాడులు...

కూటమి ప్రభుత్వంలోనే దళితులపై దాడులు...

వైయస్సార్సీపి ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి యోబు...

న్యూస్ 21 తెలుగు: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నేటి వరకు మరీ ముఖ్యంగా దళిత యువకులపై కూటమి ప్రభుత్వం ఒక టార్గెట్గా పెట్టుకుని దళిత దాడులు జరుగుతూన్నాయని వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి యోబు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై ఎక్కువ దాడులు జరుగుతున్నాయని వారికి న్యాయం జరగడం లేదని ఆయన ఆరోపించారు. వారం రోజుల క్రితం కృష్ణ లంక సీఐ నాగరాజు పై ఎన్నో ఆరోపణలు ఉన్న ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాపాడుతూ వచ్చారు.నిన్న జగన్ పర్యటన తర్వాత మీ కూటమి ప్రభుత్వం కళ్లు తెరవడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా మీరు సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి క్రాంతి కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలి.అతని యొక్క వీడియో రికార్డు నే మీరు పరిగణలోకి తీసుకొని చావుకు కారకుడు అయినటువంటి సిఐ నాగరాజు పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి.అలాగే కృష్ణలంకలోనే సాయి కృష్ణ చనిపోవడం జరిగింది అతని కుటుంబానికి కూడా న్యాయం జరిగేలా ఇప్పటికైనా కళ్లు తెరిచి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి అనాగరిక చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం తగు సూచనలు సలహాలు ఇస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.లేనిపక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా మేము ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు

Post a Comment

0 Comments