న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల పట్టణం లోని ఎస్ పి ఎస్ ఫంక్షన్ హాల్‌లో శనివారం విద్యా వెలుగులు విరిశాయి. అమెరికాలో స్థిరపడిన గడ్డం వెంకటరమణ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్థానిక ఎస్.ఎస్.సి టాపర్లకు ప్రతిభా పురస్కారాలు అందించారు.ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఈఓ శంసుద్దీన్ చేతుల మీదుగా విద్యార్థులకు మొదటి, రెండు, మూడవ బహుమతులుగా రూ.7116, రూ.5116, రూ.3116 చొప్పున నగదు బహుమతులు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.తల్లిదండ్రులు, గురువులను గౌరవించడమే విద్యార్థులకు నిజమైన విజయం" అని స్ఫూర్తినిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయుడు శ్రీనివాసులు కృషిని పలువురు ప్రశంసించారు. జన్మభూమిపై ఎన్నారై చాటుకున్న ప్రేమ అందరికీ ఆదర్శనీయమని డీఈవో శంసుద్దీన్ అన్నారు.
0 Comments