google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 ప్రభుత్వ గుర్తింపు లేని "సంకల్ప"కోచింగ్ సెంటర్ ను సీజ్ చేయాలి...

ప్రభుత్వ గుర్తింపు లేని "సంకల్ప"కోచింగ్ సెంటర్ ను సీజ్ చేయాలి...

ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ప్రయివేట్ కోచింగ్ సెంటర్ ముసుగులో స్కూల్ ను నడుపుతున్న వారిని విధులనుండి తొలగించాలి...

న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా. బద్వేలు నియోజకవర్గం. పోరుమామిళ్ల పట్టణం లో ఎటువంటి అనుమతులు లేకుండా సంకల్ప కోచింగ్ సెంటర్ ముసుగులో సాక్షాత్తు ప్రభుత్వ ఉద్యోగులు పాఠశాలను నిర్వహిస్తున్నారని నిబంధనలకు నీళ్లు వదలి విద్యార్థిని విద్యార్థుల తల్లి తండ్రులను నిలువు దోపిడీ చేస్తూన్నారని.     ఏఐఎస్ఎ. ఏఐఎస్ బి. పి ఎస్ యు. ఏ ఐ వై ఎల్ విద్యార్థి సంఘాల కార్యదర్శులు అనిల్, రాజేంద్ర, సుబ్బారాయుడు, చిరంజీవి. అఖిల్. ప్రసాదు, లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, పాఠశాలలు నిర్వహించడం చట్టవిరుద్ధమని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉపాధ్యాయులే విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను ఆర్థికంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలపై ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘ నాయకులపై ఎదురుదాడికి దిగడం, కేసులు పెడతామని బెదిరించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.ప్రభుత్వాన్ని, విద్యాశాఖను మోసం చేస్తూ అక్రమంగా విద్యా వ్యాపారం సాగిస్తున్న వారిపై వెంటనే విచారణ జరిపి, సంకల్ప కోచింగ్ సెంటర్‌ను సీజ్ చేయాలని కోరారు. అలాగే ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రమేయం ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులను సేవల నుంచి శాశ్వతంగా తొలగించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చి ప్రజలను దోచుకునే వారిని ప్రభుత్వం ఉపేక్షించరాదని, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని  వారు తెలిపారు.

Post a Comment

0 Comments