google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం..

నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం..

న్యూస్ 21తెలుగు: రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్న , రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా  వైఫల్యం చెందిందని అఖిల భారత యువజన సమాఖ్య అధ్యక్షులు గండాల_సంతోష్ కుమార్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం కడప జిల్లా కేంద్రం లోని సిపిఐ కార్యాలయం జెవి భవనం నందు జనరల్ బాడీ సమావేశం ముఖ్య అతిథులుగా గండల సంతోష్ కుమార్ సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర లు పాల్గొన్నారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం లేదా నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఆ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనదని అన్నారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఒక నిర్దిష్టమైన జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయకపోవడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. గత ప్రభుత్వ కాలంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది అని విమర్శిస్తూ, అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన నాయకులు నేడు ఆ మాటలను విస్మరించడం ఎంతవరకు సమంజసం అని ప్రశించారు. ఎన్నికల ముందు జరిగిన యువగళం పాదయాత్రలో నారా లోకేష్, ఎన్నికల సభల్లో చంద్రబాబు నాయుడు, అలాగే వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ యువతకు ఇచ్చిన హామీలు నేటి వరకు అమలుకు నోచుకోక పోవడం చూస్తుంటే ఏరు దాటినా తరువాత తెప్ప తగలేసే నిజానికి నిదర్శనం అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ నిస్పృహతో కొట్టుమిట్టాడుతూ వారి భవిష్యత్ పై భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాలు మరియు డ్రగ్స్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ఈ సమస్యను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. “డ్రగ్స్ నియంత్రణ కోసం ఈగల్ ఈ ఏ జి ఎల్ ఈ వంటి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశాం” అని చెప్పిన ప్రభుత్వం, ఆ సంస్థ ఎక్కడ పనిచేస్తుంది? ఎలాంటి చర్యలు తీసుకుంది? అనే విషయాల్లో ప్రజలకు స్పష్టత ఇవ్వడం లేదు. రాష్ట్రంలోని ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని, గంజాయి మత్తు  పదార్ధాలు నియంత్రణ చేయాలని అయన డిమాండ్ చేశారు.దశాబ్ద కాలంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు సుమారు 2 లక్షల 30 వేలకుపైగా ఉన్నాయని అంచనా. అయినప్పటికీ ప్రభుత్వం వాటిని భర్తీ చేయడంలో ఉదాసీనత ప్రదర్శిస్తుందని ప్రభుత్వం తక్షణమే   ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో  ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్న పరిస్థితిలో, కేవలం 16347 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయడం చుస్తే ప్రభుత్వానికి నిరుద్యోగ సమస్యపై చిత్తశుద్ధి  ఏపాటిదో అర్ధం అవుతుందని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు లక్షలలో ఉంటె కూటమి ప్రభుత్వం మాత్రం రానున్న మూడు సంవత్సరాల్లో కేవలం 30,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు ఉందని,  మన సకల శాఖ మంత్రిగారు ఎన్నికల సమయంలో చెప్పిన ఖాళీల సంఖ్య కు అనుగుణంగా కాకుండా నేడు తక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ప్రకటించడం ద్వారా వారి మోసపూరిత వైఖరిని సూచిస్తుందని అన్నారు. మరో పక్క మన విజనరీ ముఖ్యమంత్రి యువతను ఉద్యోగాలు చేసే పరిస్థితి నుండి ఉద్యోగాలు ఇచ్చే స్థితికి తీసుకువస్తాను, పారిశ్రామికవేత్తలుగా మారుస్తాను  అని గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు తీసుకోవచ్చారు ఆ పరిశ్రమల ద్వారా ఎంతమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారో రాష్ట్రము లోని యువతకు చెప్పే దైర్యం మీకు ఉందా అని ప్రశించారు. 
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అలాగే కడప ఉక్కు పరిశ్రమపై ఇచ్చినమాట ఎంతవరకు నెరవేరుస్తుందో అని అయన ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఇప్పటికైనా నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిరుద్యోగ మృతి మూడు వేల రూపాయలు కల్పించకపోతే ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం ఎఐవైఎఫ్ నూతన జిల్లా సమితిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు పెద్దులపల్లి ప్రభాకర్ లీలా కృష్ణ రాహుల్ శివశంకర్ నాగార్జున మునిరత్నం నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments