న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల పట్టణంలో శుక్రవారం వైష్ణవి స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులను అధిక లోడుతో వస్తూ స్టేట్ బ్యాంక్ నుండి విష్ణువర్ధన్ రెడ్డి అనే ఆర్మీ వ్యక్తి బైకు లో వస్తుండగా ఆయనను తగిలించారని సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్.సహాయ కార్యదర్శి కేశవ, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి జెబి. ఉల్లా. ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిపిఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ పల్లె వెలుగు బస్సులు వలె, ఎంతమంది విద్యార్థులను అంటే అంత మంది విద్యార్థులను ఎక్కించడం, వైష్ణవి స్కూల్ కు పరిపాటిగా మారిందని వారు అగ్రహారం చెందారు. అదేవిధంగా ఇంకా ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ఉంటే వందలాదిమంది విద్యార్థుల తల్లిదండ్రులు బాధపడాల్సిన పరిస్థితి నెలకొన్నది వారు ఆరోపించారు. ఒకపక్క అధిక ఫీజులు, రకరకాల బుక్స్, టై, బెల్టు, ఎగ్జామ్ ఫీజుల పేరుతో, పిల్లల తల్లిదండ్రుల నుండి ఆదిక ఫీజులు రాబట్టుకొని. లక్షల రూపాయలు సంపాదించుకున్నప్పుడు అదనపు బస్సులు వేసి ఉంటే ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండేవని కాదన్నారు.ప్రైవేట్ స్కూల్లో నడిపే వాహనాలకు ఎప్పటికప్పుడు ఇన్సూరెన్స్, ట్యాక్స్, ఎఫ్ సి వంటివి వాహనాలు తనిఖీ ఉంటే ఈ విధంగా అధికలోడు ఎక్కించలేని పరిస్థితి కనుక వెంటనే వైష్ణవి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని,విష్ణువర్ధన్ రెడ్డి కి న్యాయం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూళ్లలో డ్రైవర్లకు ఎలాంటి లైసెన్సులు ఉన్నాయో, లేవో తెలియని పరిస్థితుల్లో ఉన్నారని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కేశవ, సఫా తదితరులు పాల్గొన్నారు
0 Comments