బద్వేల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట అన్నదాత పోరుబాట

 బద్వేల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట అన్నదాత పోరుబాట



వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు. వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. 






ఈ కార్యక్రమానికి బద్వేల్ ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి. ఎమ్మెల్యే దాసరి సుధా. రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి. ఆదిత్య రెడ్డి. గురు మోహన్.ఇక వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొని ఆర్టీవో కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి పండించిన పంటలు మిరప. ఉల్లి. వరి. పసుపు. మామిడి. చీని. మరియు ఇతర పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని.  ఇప్పుడు రైతులకు యూరియా అందక  బ్లాక్ మార్కెట్లో కొనవలసిన పరిస్థితి వచ్చిందని బస్తా ధర 250 రూపాయలు ఉందని ఇప్పుడు 450 రూపాయలకు కొనవలసిన పరిస్థితి ఏర్పడిందని. గత ప్రభుత్వంలో ఆర్ బి కే ల ద్వారా రైతులకు కావాల్సిన ఎరువులు సరఫరా చేసేవారని. విత్తనాలు. మరియు రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ పాలసీ ప్రభుత్వమే చేస్తూ ఉండేదని . క్రాప్ బుకింగ్ కూడా ప్రభుత్వ నిర్వహించేదని.ఇప్పుడు అవన్నీ కూడా లేవని రైతులు అవస్థలు పడుతున్నారని వారు ఆరోపించారు. గతంలో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నారని. ఆ తరువాత వైయస్ రాజశేఖర్ రెడ్డి  వ్యవసాయం పండుగ అనే విధంగా రైతులకు అన్ని విధాల సహకరించాలని ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగిందని. 


వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతులకు అన్ని విధాలా సహకారం అందించే వారిని. ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసేదని.ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అవన్నీ లేవని రైతులు వాపోతున్నారని వారన్నారు.






Post a Comment

0 Comments