మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆద్వర్యంలో ఘనంగా జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల అభినందన సభ...

మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆద్వర్యంలో ఘనంగా జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల అభినందన సభ...

వైయస్సార్ కడప జిల్లా. బద్వేలు నియోజక వర్గం. పోరుమామిళ్ల పట్టణంలోని అంబేద్కర్ భవనంలో రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైన బండి పరిమల జ్యోతి.కొడవటిగంటి సుదర్శన్. మరియు సగిలి బాలయ్య ను మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ నాయకులు ఓబుళాపురం శోభన్ కుమార్ ఆధ్వర్యంలో  రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు సగిలి జాకోబ్ అధ్యక్షతన ఘనంగా  సన్మానిస్తూ అభినందన సభ నిర్వహించారు. ఈ సమావేశానికి  మాదిగ ఉద్యోగులు ఎమ్మార్పీఎస్ నాయకులు స్థానిక ప్రజా సంఘాల నాయకులు విద్యావేత్తలు  పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అవార్డు గ్రహీతలకు శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి మెడల్స్ తో సత్కరించారు. ఈ సందర్భంగా మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ నాయకులు ఓబులాపురం శోభన్ కుమార్ మాట్లాడుతూ


ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు చెప్పేవాడు కాదని. ఒక తరం భవిష్యత్తును తీర్చిదిద్దేవాడు. విద్యా కాంతితో చీకటిని తొలగించి సమాజానికి వెలుగు నింపే మహత్తర సేవ ఉపాధ్యాయుడిదే. బండి పరిమల జ్యోతి గ, కొడవటిగంటి సుదర్శన్. సగిలి బాలయ్య. తమ అంకితభావం, కృషి, విద్యార్థుల పట్ల చూపిన ప్రేమతో ఈ అవార్డుకు అర్హులయ్యారు. వారి సేవలు కొత్త తరాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తాయని హృదయపూర్వకంగా అభినందించారు.ఈ సందర్భంగా సమాఖ్య నాయకులు మరియు ముఖ్య అతిథిగా హాజరైన కాశినాయన మండలం విద్యాశాఖ అధికారి నిర్మల ఉపాధ్యాయులపై ప్రశంసలు కురిపిస్తూ విద్యా రంగంలో చేసిన అహర్నిశ శ్రమ, పాఠశాలల్లో విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించే కృషి, సమాజ వికాసానికి ఉపాధ్యాయ వృత్తి అందించే సేవలు అమూల్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ నాయకులు చిన్నబాబు. నియోజకవర్గం అధ్యక్షుడు ఓబయ్య. కమలాపురం ప్రసాద్. ఈరి బాలజోజి.ఈరి ఆనంద్. గడిగోట బాల ఓబయ్య.
 భూతపాటి ప్రభాకర్. సగిలి గురయ్య.ఆవులూరి గురయ్య.సింహరాయలు, దేవరాజు, రాయపాటి ప్రసాద్ , ఇజ్రాయెల్. మానవహక్కుల సంఘం నాయకులు ముత్యాల ప్రసాద్. బండి ఓబులేసు. నాయకులు సగిలి ప్రసాదరావు.  పసుపుల ప్రసాద్.   డి యల్ చంద్రశేఖర్.రాయపాటి పాపయ్య. తిరివీధి జయరాములు.  నారిపోగు మనోజ్ సాగర్. ఎమ్మార్పీఎస్ నాయకులు గురయ్య,  వై ప్రసాద్. సగిలి విజయ్. భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరపోగు రవి. తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments