న్యూస్ 21 తెలుగు-పోరుమామిళ్ల: కుంఫు మాస్టర్ ఆర్ట్స్ గౌరవాన్ని తక్కువ చేయడం సరైన పద్ధతి కాదని జనసేన పార్టీ పోరుమామిళ్ల మండల అధ్యక్షులు శీలంశెట్టి లక్ష్మయ్య మండి పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కుంఫు మాస్టర్ ఆర్ట్స్‌పై ఉన్న ఆసక్తి, ప్రమేయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని. కానీ కుంఫు మాస్టర్ ఆర్ట్స్ గౌరవాన్ని తక్కువ చేయడం.ఆ అంశాన్ని రాజకీయ విమర్శలకు వాడుకోవడం ఏమాత్రం సరి కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.”టైగర్ ఆఫ్ మాస్టర్ ఆర్ట్స్” అనే బిరుదు పవన్ కళ్యాణ్‌కు ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు మాకు తెలియదంటూ వైయస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ఎటకారంగా మాట్లాడటం పూర్తిగా అనుచితమని ఆయన మండిపడ్డారు. టైగర్ ఆఫ్ మాస్టర్ ఆర్ట్స్ అనే బిరుదు డాక్టర్ సయ్యద్ మహమూద్ సిద్ధిక్ మహమూది గురువు ద్వారా పొందడం జరిగింది. సమాజంలో క్రీడలు, మార్షల్ ఆర్ట్స్‌కు ప్రోత్సాహం ఇచ్చే వ్యక్తిత్వాన్ని గుర్తించి వచ్చిన గౌరవాన్ని ఇలా తక్కువ చేసి మాట్లాడడం రాజకీయ సంస్కృతికి మచ్చతెచ్చే విధంగా ఉందన్నారు.
పవన్ కళ్యాణ్ అనేది కేవలం రాజకీయ నాయకుడే కాకుండా యువతకు స్ఫూర్తినిచ్చే వ్యక్తి అని, కుంఫు వంటి మాస్టర్ ఆర్ట్స్‌ను ప్రోత్సహించడం ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం వంటి విలువలను ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన తెలిపారు. అలాంటి ప్రయత్నాలను అభినందించాల్సిన స్థితిలో, చీప్ కామెంట్స్ చేయడం వైయస్సార్సీపీ నేతల రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని ఆయన తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా, వ్యక్తిగత గౌరవాన్ని, ప్రజాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని, ఆయన అన్నారు
0 Comments