సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనసేన పార్టీ పోరుమామిళ్ల మండల అధ్యక్షులు శీలంశెట్టి లక్ష్మయ్య శుభాకాంక్షలు తెలియజేశారు. కువైట్ నుండి ఫోన్లో మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్ఫూర్తితో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలిని.సంక్రాంతి అనేది కేవలం పండుగ మాత్రమే కాకుండా రైతుల కష్టానికి గౌరవం తెలిపే, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను బలపరిచే మహత్తర సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు.ఈ పండుగ ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, సుఖసంతోషాలు నింపాలని, ముఖ్యంగా అన్నదాత రైతుల జీవితాల్లో సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని, పండుగ స్ఫూర్తితో సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం మరింత బలపడాలని లక్ష్మయ్య తెలిపారు.
0 Comments