ఎన్నికల సంఘం వ్యవహార శైలి మార్చుకోవాలి...కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి విజయ జ్యోతి...

భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కై ఓట్లు దొంగతనానికి పాల్పడిన కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహార శైలి మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్ డి విజయ జ్యోతి డిమాండ్ చేశారు. లక్ష సంతకాల సేకరణలో భాగంగా ఏఐసీసీ మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి.ఆదేశాల మేరకు శనివారం వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి సభ్యులు మరియు పోరుమామిళ్ల మండల అధ్యక్షులు అన్వర్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు ఎన్.డీ. విజయ జ్యోతి. పిసిసి సభ్యులు అన్వర్ లు మాట్లాడుతూ  కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో అవకతవకలు సృష్టించి భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కై అనేక రకాలుగా ఓట్ల చోరీకి పాల్పడుతుందని వారు ఆరోపించారు 
అంతేకాకుండా లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం దగ్గర ఎలాంటి సమాధానం లేదని, ఎన్నికల సంఘానికి ప్రశ్నలు వేస్తుంటే భారతీయ జనతా పార్టీ ఉలిక్కిపడటం హాస్యాస్పదంగా ఉందని,ఇలాంటి పరిణామాలన్నీ భారతీయ జనతా పార్టీకి ఎన్నికల సంఘానికి ఉన్న దోస్తీని తేటతెల్లం చేశాయని  కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశాన్ని పరిపాలించే హక్కు కోల్పోయిందని బిజెపి పాలనకు ఇక నూకలు చెల్లాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వేస్తున్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న విషయం దేశ ప్రజలంతా  గమనిస్తున్నారని, ఎన్నికల సంఘం ఇకనైనా తన వైఖరి మార్చుకొని అనేక రకాలుగా ఓట్ల చోరీ జరుగుతున్నటువంటి పరిస్థితినీ చక్కబెట్టాలని, ఈ సంతకాల సేకరణ ద్వారా భారత ప్రజల యొక్క మనోగతాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని వారు అన్నారు.
 రాజ్యాంగబద్ధ , స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం వైఖరి భారత రాజ్యాంగానికి తీరని మచ్చ అని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ  ఇద్దరు కూడా నివసించలేని ఒక ఇంట్లో కర్ణాటకలో ఏకంగా 80 మంది పేరున ఓటర్ లిస్ట్ తయారు చేయడం, ఒకే వ్యక్తి రెండు లేదా మూడు రాష్ట్రాలలో ఓటు హక్కును కలిగి ఉండడం భారత ఎన్నికల సంఘం యొక్క దిగజారుడుతనానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఓట్ల చోరీతో ఏకంగా మూడుసార్లు గద్దెనెక్కిన బిజెపి పార్టీ భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని, భారత ప్రజాస్వామ్య సూత్రానికి ఇది తూట్లు పొడిచే ప్రక్రియ అని వెంటనే డిజిటల్ ఓటర్ల జాబితా తయారు చేసి భద్రపరచాలని వారు డిమాండ్ చేశారు అంతేకాకుండా మీడియా సమావేశంలో విలేకరులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి గారిని పోరుమామిళ్ల లో జరుగుతున్న రోడ్డు గురించి ఎందుకు మేడం రోడ్డుకు అనుమతి వచ్చినప్పుడు 90 అడవులు వెడల్పు అన్నారు మళ్లీ వైయస్సార్ ప్రభుత్వంలో దానిని 80 అడుగులు ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం మళ్లీ దానిని 80 అడుగుల నుంచి 72 అడుగులకు కుదించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించగా ఆమె మీడియా వారితో రోడ్డు సమస్య గురించి ఇంతకు ముందు కడపకు వచ్చినప్పుడు సీఎం గారికి లెటర్ రూపంలో పంపించాను అప్పుడు రోడ్డుపై స్పందించి రోడ్డు పనులు మొదలుపెట్టారు ఇప్పుడు కూడా రోడ్డు వెడల్పు లు ఎంత మేరా ఉంటే అంతమేరా పనులు చేసే విధంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ప్రతిపక్ష పార్టీ  పాత్రలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ప్రజలందరికీ ఇబ్బందులు కలగకుండా చేస్తామని వారు కూడా చర్యలు తీసుకోకపోతే చేసేంతవరకు పోరాడుతామని వారన్నారు.సంతకాల సేకరణ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్లూరు భాష, బి.కోడూరు మండల పార్టీ అధ్యక్షుడు గుర్రప్ప, కాశినాయన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పుల్లూరు పెద్ద ఖాజావల్లి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి బాలసుబ్బయ్య, బుడిగి శ్రీనివాసులు. కార్యకర్తలు నాగరాజు.సోహెల్. ముజ్జు.సమీర్.రిజ్వాన్. నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments