రోడ్లపై నిలిచిన వర్షపు నీరు..అవస్థలు పడుతున్న ప్రజలు...నిలిచిన వర్షపు నీటిని జెసిబి తో తొలగించిన టిడిపి నాయకులు...

నిలిచిన వర్షపు నీటిని జెసిబి తో తొలగించిన టిడిపి నాయకులు...

కురుస్తున్న వర్షాల ప్రభావంతో వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో  వర్షపు నీళ్ళు రోడ్డుపై నిలిచి తాండవిస్తున్నాయి. ఈ నీటి వల్ల పట్టణంలోని ప్రజలతోపాటు వృద్ధులు. వికలాంగులు. రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. కడప పోయా విజయవాడ కు వెళ్లేందుకు హైవే ఫోర్ లైన్ రోడ్డు వేస్తున్న నే పద్యంలో భాగంగా పోరుమామిళ్ల పట్టణంలో ఫోర్ లైన్ రోడ్డు వేస్తున్నారు. దీంతో వర్షం నీళ్లు ఎటు వెళ్లలేక నిలిచి పోయాయి. ఈ నీటి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపున వర్షాలు. మరోవైపున రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీంతో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోడ్డు పూర్తి కాకపోవటంతో వాహనదారులు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో  తెలుగుదేశం పార్టీ నాయకులు పోరుమామిళ్ల సహాయ సహకార సంఘం చైర్మన్ కల్లూరి. వెంకట కృష్ణారెడ్డి. పోరుమామిళ్ల మాజీ ఎంపీటీసీ ఇమామ్ ఉషాన్. సీతా వెంకటసుబ్బయ్య. గాలి మురళి. ప్రొఫెసర్ భాష. తదితర నాయకులు చొరవ తీసుకొని జెసిబి తో నిలిచిన వర్షపు నీటిని బయటికి వెళ్లేందుకు తొలగించారు.

Post a Comment

0 Comments