పోలీసుల‌ పై దాడి చేసిన బీహార్ కార్మికులు.. పలువురికి గాయాలు..

సూర్యాపేట జిల్లా. పాలకవీడు మండలం డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద తీవ్ర ఉద్రిక్తత జరిగింది.
బీహార్ కార్మికులు పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడికి‌ దిగారు.బీహార్ కార్మికుల దాడిలో రెండు పోలీస్ వాహనాలు ధ్వంసం అయ్యాయి.
నిన్న డెక్కన్ సిమెంట్‌లో పనిచేస్తున్న సమయంలోగాయపడిన ఓకార్మికుడు మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
న్యాయం చేయాలని కంపెనీ ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు.చెదరగొట్టే సమయంలో కార్మికులకు పోలీసులకి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులపై దాడికి దిగారు కార్మికులు.

Post a Comment

0 Comments