రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి వ్యవసాయం ఉనికి లేకుండా చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తుందని గత ప్రభుత్వంలో ఐదు వేళ్లతో పాటు పైసా భారం లేకుండా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా ను అటకెక్కించిన కూటమి సర్కార్ 15 నెలలుగా ఏ ఒక్క పంటకు బీమా పరిష్కారం అందకుండా చేయటం దుర్మార్గమని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ మెంబర్ ఎస్ చంద్రశేఖర్ అన్నారు
వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో భగత్ సింగ్ నగర్ సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్. చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మన రైతులు పండించే దాన్యం తినడానికి ఎగుమతికి పనికిరాదని కేవలం మద్యం తయారీకే తప్ప వరి ఎందుకు పనికిరాదని అనడం దురదృష్టకరమన్నారు అలాగే విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులను చేపట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాలతో పాటు సచివాలయాలను నిర్వీర్యం చేశారు నాన్ సబ్సిడీ విత్తనాల సరఫరాను నిలిపివేశారు సబ్సిడీ విత్తనాలకు కోత పెట్టారని అదునుకు అందాల్సిన యూరియాను కావాలనే అందకుండా చేస్తూ సాగును చిన్నాభిన్నం చేశారన్నారు యూరియా కోసం రైతులు పడరాన్ని పాట్లు పడుతుంటే ఎకరాకు అరకట్ట కూడాఅందించలేకపోతున్నారని ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర దక్కక రైతులు విలవిలలాడిపోతుంటే వేడుక చూస్తున్నారే తప్ప ఆదుకునే ప్రయత్నం చేసిన పాపను పోలేదని వారన్నారు ధరలు పతనమైనప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకొని వ్యాపారులతో పోటీపడి రైతులకు కొన్ని మద్దతు ధర ప్రకటించాల్సింది పోయి గాలికి వదిలేసి మద్దతు ధర మించి ధర లభించే ఫైన్ వెరైటీలకు సైతం ప్రస్తుత మద్దతు ధర కరువు అవుతున్న ప్రభుత్వం చేష్టలుడికి చూస్తుందని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని నామరూపాలు లేకుండా చేయాలని ఉద్దేశం కనిపిస్తుందని వారు ఆరోపించారు పైర్లకు ఎరువు లేదు పంటలకు ధర లేక సాగునీటి వ్యవస్థలో తీవ్ర జాప్యమే కాకుండా పరిశ్రమలను స్థాపించడంలో ఫోటో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని వారు ఎద్దేవా చేశారు తక్షణమే రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటలకు ఎరువులు అందించి రైతు ఆత్మహత్యలను నివారించాలని అలాగ బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్న ఎరువులను వ్యాపారస్తులపై క్రిమినల్ కేసులు పెట్టాలని వారి డిమాండ్ చేశారు అదేవిధంగా 2014-2019 మధ్య సీఎంగా ఉన్నప్పుడు సోమశిల లిఫ్ట్ ఇరిగేషన్ నుండి బద్వేల్ ప్రాంతానికి ఒక టీఎంసీ నీరు అందించే విధంగా జీవో ఇచ్చారని ఆ జీవోను గత జగన్ ప్రభుత్వంలో పట్టించుకోలేదని మేము అధికారంలోకి వస్తే తక్షణమే జీవోను అమలు చేసి బద్వేలు ప్రాంత రైతాంగానికి సోమశిల జలాలను బద్వేల్ ప్రాంతానికి అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన కూటమినేతలు 15 నెలలు గడుస్తున్న వారు ఇచ్చిన జీవో మాటను ఊసే ఎత్తకపోవడం సరైంది కాదని వారన్నారు తక్షణమే బద్వేల్ నియోజకవర్గం లోని బద్వేలు పెద్ద చెరువును కలసపాడు చెరువును మినీ రిజర్వాయర్ గా చేసి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని వారు కోరారు ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ జిల్లా కమిటీ సభ్యులు కె జకరయ్య బి అనిల్ ఏరియా కమిటీ సభ్యులు రామరాజు, బాబు, జయరామరాజు,చంద్రపాలు, తదితరులు పాల్గొన్నారు
0 Comments