జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులను సహించరు. జనసేన పార్టీ నైతిక విలువలు, క్రమశిక్షణ, చట్టపరమైన గౌరవం విషయంలో ఎప్పుడూ రాజీ పడదు. అందువల్ల, ఆ వ్యక్తిని ఇకపై పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్ననీయం అన్నారు. పార్టీకి సంబంధించిన ఏ విధమైన కార్యక్రమాలలోనూ అతనికి స్థానం లేదు.జనసేన పార్టీ తరఫున స్పష్టంగా తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వ్యక్తులు పార్టీ కింద కొనసాగలేరు. పార్టీ పూర్తిగా ప్రజాసేవ, శుద్ధమైన రాజకీయాలకు అంకితమై ఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాము.కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments