తిరుపతి జిల్లా. తిరుపతి రూరల్ మండలం పరిధిలోని నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) మహిళా నైపుణ్యాభివృద్ధి మరియు సాధికారత కేంద్రంలో శిక్షణ పొందిన విద్యార్థులకు, మహిళలకు సర్టిఫికెట్ ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
విద్యార్థులకు, మహిళలకు సర్టిఫికెట్ ప్రధానం కార్యాక్రమానికి ముఖ్యఅతిధిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారి సతీమణి పులివర్తి సుధా రెడ్డి హాజరయ్యారు.
పులివర్తి సుధా రెడ్డి కి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) మహిళా నైపుణ్యాభివృద్ధి మరియు సాధికారత కేంద్రం జిల్లా మేనేజర్ ఫారజానా. ఘన స్వాగతం పలికారు.అనంతరం పులివర్తి సుధాకర్ రెడ్డి. జిల్లా మేనేజర్ ఫారజాన. జ్యోతి ప్రజ్వలనచేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మహిళా నైపుణ్యాభివృద్ధి మరియు సాధికారత కేంద్రంకు విచ్చేసిన మహిళలను పులివర్తి సుధా రెడ్డి. ఆప్యాయంగా పలకరించారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతికి, మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని దృఢ సంకల్పం తో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.
ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో యువతకు ఉద్యోగ అవకాశాలు మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో మహిళలకు ఉచిత టైలరింగ్, జ్యూట్ బ్యాగ్ శిక్షణ, స్వయం ఉపాధి, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా పచ్చళ్ళు, తినుబండారాలు, అమ్ముకునే వేసులుబాటు కల్పించిన కూటమి ప్రభుత్వం అన్నారు.నర్సింగ్, టైలరింగ్ మరియు ఫాబ్రిక్ కటింగ్ లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను పులివర్తి సుధా రెడ్డి.జిల్లా మేనేజర్ ఫారజానా పంపిణీ చేశారు.మహిళా నైపుణ్యాభివృద్ధి మరియు సాధికారత కేంద్రంలో నర్సింగ్ శిక్షణ పొందిన 20 మంది మహిళలు తిరుపతి పరిసర ప్రాంతాలలోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉద్యోగం పొందారు.
0 Comments