ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి. జిల్లా ఎస్పీ...వైయస్సార్ కడప జిల్లా. షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్...

వైయస్సార్ కడప జిల్లా. షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్...

వై.ఎస్.ఆర్ కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్.పి గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రజా ఫిర్యాదుల  పరిష్కార వేదిక”కార్యక్రమంలో జిల్లా ఎస్పీ.షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ కార్యక్రమంలో  పాల్గొని, జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 121 ఫిర్యాదులు పి జి ఆర్ ఎస్ కు వచ్చాయి.ఈ సందర్భంగా ఎస్పీ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్‌లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఎస్పీ  పేర్కొన్న ముఖ్య అంశాలు.పోలీస్ శాఖ ద్వారా పరిష్కారం అయ్యే ప్రతి ఫిర్యాదును ప్రజలు స్వేచ్ఛగా మా దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ప్రజల నుండి అందిన సదరు ఫిర్యాదులను నిర్ణీత సమయంలో చట్ట పరిధిలో పరిష్కరిస్తాం. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు తమ వినతులను విన్నవించుకున్నారు. వాటిపై సంబంధిత పోలీస్ అధికారులతో జిల్లా ఎస్.పి నేరుగా మాట్లాడి సమస్యను చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ(అడ్మిన్)  కె.ప్రకాష్ బాబు, డి.టి.సి డి.ఎస్.పి అబ్దుల్ కరీం, మహిళా పి.ఎస్ డి.ఎస్పీ బాలస్వామి రెడ్డి. లు పాల్గొన్నారు

Post a Comment

0 Comments