పోరుమామిళ్ల మండలం రంగసముద్రం -1 లో రైతు సేవ కేంద్రం నందు ప్రాజెక్టు డైరెక్టర్, సూక్ష్మసేద్య ప్రణాళికా...

వైయస్సార్ కడపజిల్లావారి ఆద్వర్యంలో పోరుమామిళ్ల వ్యవసాయ డివిజన్ పరిధిలో పనిచేయుచున్న  వ్యవసాయ / ఉద్యాన గ్రామ సహాయకులకు  బిందు మరియు తుంపార్ల సేద్యం పైన శిక్షణ మరియు అవగాహన సదస్సు  నిర్వహించడం జరిగినది . 
ఇందులో బాగంగా వేంకటేశ్వర రెడ్డి ,జిల్లా పథక  సంచాలకులు మాట్లాడుతూ 2025 -26 ఆర్థిక సంవత్సరానికి  బిందు మరియు తుంపార్ల సేద్య పరికరాలు కావాల్సిన  రైతులను గుర్తించి.బిందు సేద్య పరికరాలు ఏర్పాటు చేసుకొనేలా అవగాహన కలిపించాలని తెలిపారు.   ముందుగా వివిద పంటలలో డ్రిప్ ద్వారా ఎరువుల యాజమాన్యం గురించి వివరిస్తూ.డ్రిప్ సిస్టమ్ నందు అమర్చే వెంచూరి ద్వారా  నీటిలో కరిగే ఎరువులను నేరుగా మొక్క వ్రేళ్ళ దగ్గరే పడే విదంగా ఇవ్వ వచ్చునని, ఆ పద్దతిని ఫర్టిగేసన్  పద్దతి అంటారని తెలిపారు.  ఫర్టిగేసన్  పద్దతిలో వివిద పంటలో ఎరువుల యాజన్యం సూచించే  షెడ్యూల్ కరపత్రాన్ని ఆవిస్కరించారు.డ్రిప్ ఇరిగేషన్ పద్దతిలో మొక్కకి కావాల్సిన ఎరువులు మరియు ఇతర పోషకాలని నీటితో పాటుగా నీరుగా అందించటం ద్వారా ఎరువుల  సమర్థ వినియోగం తో పాటు ఎరువుల ఆదా  జరుగును. మొక్కకి కావాల్సిన నీరు.గాలి  మరియు పోషకాలు ఎల్లప్పుడూ సమపాళ్లలో అందుట వలన మొక్క ఆరోగ్యకరంగా పెరిగి అధిక దిగుబడి ఇస్తుంది. అలాగే బోర్ వున్న ప్రతి రైతును గుర్తించి, డ్రిప్ అమార్చుకొనే విదంగా రైతులను ఒప్పించే బాద్యత ప్రతి ఒక్కరి భాద్యతగా తీసుకోవాలని కోరారు. బిందు సేద్య పరికరాలను అమర్చిన తర్వాత సరపరాదారుని నుండి రైతులకు సరపరా అయిన మెటీరీయల్ పూర్తిస్తాయిలో అందినది, లేనిది,పరికరాల నాణ్యతా ప్రమాణాలు పాటించాయా లేదా , అలాగే  పరికరాల అమరిక, నిర్వహణ గురించి తనికీ చేయుటలో గ్రామ వ్యవసాయ/ ఉద్యాన సహాయుకులదే అని, ఎటువంటి లోతుపాట్లు జరిగిన అటు కంపనీ పైన ఇటు తనికి అడికారులపైన తగు చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు. బిందుసేద్యం -రాయితీ వివరాలు 
1 . 5 ఎకరాల లోపు భూమి వున్న సన్నకారు, చిన్న కారు రైతులకి   90 శాతం రాయితీతో గరిస్టంగా రూ.2.18 లక్షల వరకు బిందు సేద్య పరికరాలు అమర్చుకోవచ్చును. 2. 5-10 ఎకరాల మద్య  భూమి కలిగిన పెద్ద రైతులు  90 శాతం రాయితీతోగరిస్టంగా రూ.3.46  లక్షల వరకుబిందుసేద్యపరికరాలుఅమర్చుకోవచ్చును 
3. 10 ఎకరాల పైబడిన పొలం కలిగిన పెద్ద రైతులకి 50 శాతం రాయితీ  పైన బిందు సేద్య పరికరాలు అమర్చడం జరుతుందని తెలిపారు .
దరకాస్తూ చేసుకొనుటకు దరకస్తూ చేసుకొనుటకు రైతులు 1-b.ఫీల్డ్ మ్యాప్  ఆధార. బ్యాంక్ పాస్బుక్ నఖలు మరియు చెక్ బంధి తీసుకెళ్ళి సంబందిత రైతు సేవ కేంద్రం నందు నమోదు చేసుకోవాలి.తర్వాత కంపెనీ ప్రతినిధులు ప్రాధమిక సర్వే చేసి డ్రిప్ డిజైన్ వేసి మొత్తం అమౌంట్.రాయితీ వివరాలు రైతుకి వివరిస్తారు.  రైతు వాటా అమౌంట్ ని రైతు చెల్లించిన వెంటనే జిల్లా కలెక్టర్ వారి పరిపాలన అనుమతితో డ్రిప్ పరికరాలని అమర్చడం జరుగుతుంది.వ్యవసాయ సహాయ సంచాలకులు మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ రైతు వేసిన ప్రతి పంట ఎప్పటికప్పుడు తప్పకుండా  నమోదు చేయాలని , పంట నమోదు చేసేటప్పుడు పంట రకం, నాటిన తేదీ,జల వనరులు , ఇరిగేషన్ పద్దతి మొదలగు అంశాలు తప్పకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని కోరారు. పంట నమోదు ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రైతు  సేవ కేంద్ర సహాయకులకు కోరారు . వివిద పంటలలో నానో యూరియా వినియోగం పెంచాలని, వాడడం వలన ప్రయోజనాలని రైతులకి వివరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల వ్యవసాయ సహాయ సంచాలకులు మురళీధర్ రెడ్డి , మండల వ్యవసాయ అధికారులు చంద్ర మోహన్, చంద్ర మోహన్ రెడ్డి. ఉద్యనాధికారి శ్రీనివాసుల రెడ్డి.మైక్రో ఇరిగేషన్ ఏరియా అధికారి మహేష్  బాబు. గ్రామ వ్యవసాయ / ఉద్యాన సహకులు పాల్గొనటం జరిగినది.

Post a Comment

0 Comments