google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 హెచ్చరిక బోర్డును తొలగించి పేదలకు 3 సెంట్లు చొప్పున పంచాలి..

హెచ్చరిక బోర్డును తొలగించి పేదలకు 3 సెంట్లు చొప్పున పంచాలి..

వైఎస్ఆర్ కడప జిల్లా. బద్వేలు రెవెన్యూ డివిజన్ గోపవరం మండలం గోపవరం రెవెన్యూ పొలం సర్వేనెంబర్ 1557 లో ఉన్న హెచ్చరిక బోర్డును తొలగించి అర్హులైన పేదలకు ప్రతి ఒక్కరికి 3 సెంట్ల చొప్పున కేటాయించి "ఎన్ టి ఆర్" గృహాలకు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ మెంబర్ ఎస్, చంద్రశేఖర్ జిల్లా కమిటీ మెంబర్ కె, జకరయ్యలు డిమాండ్ చేశారు 
శుక్రవారం1557 లో ఉన్న 15 ఎకరాలలో హెచ్చరిక బోర్డును తొలగించి ఎన్ టి ఆర్ గృహాలకు కేటాయించాలని ఆర్డీవో కార్యాలయంలో పరిపాలన అధికారి ఏవో కు ఆ పార్టీ బృందం వినతి పత్రం సమర్పించారు 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు నెలల క్రితం 1557 సర్వేనెంబర్ స్వాధీనం చేసుకోవాలని ఆ సర్వే నెంబర్ లో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయాలని గోపవరం తాసిల్దార్, బద్వేలు ఆర్డీవో గారికి  వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని అన్నారు జులై 18వ తేదీన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బృందం ఆధ్వర్యంలో ఆ స్థలాన్ని పరిశీలించి దక్కుతే పేదలకే దక్కాలి లేదా ప్రభుత్వ అవసరాలకు తగ్గాలని స్థలం పరిశీలించడం జరిగిందని అన్నారు గోపవరం తాసిల్దార్ అత్యుత్సాహంతో స్థలం పరిశీలించిన పార్టీ నాయకులపై గోపవరం పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు పెట్టడం జరిగింది అన్నారు ఈ మేరకు గోపవరం పోలీసులు 41 ఏ నోటీసులు ఇచ్చి ఆరు మందికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది అన్నారు మరుక్షణమే గోపవరం తాసిల్దార్ అక్కడ హెచ్చరిక బోర్డును  ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు      ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా రెవిన్యూఅధికారులుకాపాడారనిసంతోషించాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బద్వేల్లో జరిగిన కబ్జాలపైన ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ గారు యువకులం పేరుతో బద్వేలు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అధికారంలోకి వస్తే ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటామని ఆక్రమితదారుల గుండెల్లో నిద్ర పోదామని తెలిపారు ఆ మేరకు ఆక్రమిత భూములలో లిస్ట్ అవుట్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ గారు తహసిల్దారులకు ఆదేశాలు ఇవ్వడంతో గోపవరం తాసిల్దార్ 1557 లో 15 ఎకరాల భూమి చంద్రశేఖర్ఆక్రమించినట్టు అనుభవంలో ఉన్నట్టు ఆర్డిఓ గారికి రిపోర్టు ఇవ్వడం ఆర్డిఓ గారు జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకుపోవడం రెవిన్యూ అధికారుల చేతకాని తనమని వారన్నారు తమ ఆధీనంలో ఉంటే అక్కడ హెచ్చరిక బోర్డు ఎందుకు పెట్టారని వారు  ప్రశ్నించారు ఇప్పటికే 15 57 ను ఆక్రమించామని పోలీస్ కేసులు ఉన్నందువల్ల న్యాయస్థానంలో జరుగుతుంది కాబట్టి తమ ఆధీనంలో ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారని తక్షణమే అక్కడ హెచ్చరిక బోర్డును తొలగించి ఎన్టీఆర్ గృహాలకు కేటాయించి మేము ఇచ్చే లిస్టుకు ప్రతి ఒక్కరికి మూడు సెంట్లు ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు గోపవరం మండల పరిధిలో అధికార ప్రతిపక్ష బడా నేతలు ఆక్రమించిన వారి పేరు లిస్టులో పెట్టకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతు డబ్బు ఉన్న వారికి ఒక న్యాయం లేని వారికి ఒక న్యాయంగా వ్యవహరిస్తున్నారని వారు దుయ్యబెట్టారు తక్షణమే తమ ఆధీనంలో ఉన్న భూమిని తన దగ్గర ఉన్న పేద ప్రజలు దళితులు మైనారిటీలు వెనుకబడిన వర్గాలకు తక్షణమే పంచాలని లేని ఎడల పేద ప్రజలతో భూ పోరాటం చేస్తామని, కేసులు జైళ్లు తమ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కొత్తవి కాదని వారు హెచ్చరిక చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బి, అనిల్ ఏరియా కమిటీ సభ్యులు బాబు, చంద్రపాల్, నారాయణ, జైపాల్, మహబూబ్ బషా, జయరామరాజు, రమణ, తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments