google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు...

కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు...

కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని. సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ అయ్యాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మరియు కూటమి నాయకులు పదే పదే చెప్పడం హాస్యాస్పదమని రాజ్యసభ మాజీ సభ్యులు.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి అన్నారు. 
ఆదివారం వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణం లో ని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలలో ప్రధానమైన హామీలు ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని ఆయన ఆరోపించారు.నిరుద్యోగ యువతకు సంబంధించి ప్రతినెల నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు ఇస్తామని సూపర్ సిక్స్ హామీలలో చెప్పడం జరిగిందని 16 నెలలు కావస్తున్నప్పటికీ ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ఈ 16 నెలల్లో ఒక్కొక్కరికి 48 వేల రూపాయలు కూటమి ప్రభుత్వం నామం పెట్టిందన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని. ఈ విధంగా నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం నమ్మించి మోసగించిందని ఆయన మండిపడ్డారు.19 -- 59 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని సూపర్ సిక్స్ హామీల్లో  చెప్పారని.16 నెలలు అయినప్పటికీ ఇంతవరకు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క కోటి 80 లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారని.16 నెలలకుగాను ఒక్కొక్క ఆడబిడ్డకు 24,000 రూపాయల చొప్పున చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఆయన ఆరోపించారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం లో ఆడబిడ్డలను నమ్మించి మోసగించిందని ఆయన ధ్వజమెత్తారు. 
ఎస్సీ.ఎస్టీ.బిసి.ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని సూపర్ సిక్స్ హామీల్లో చెప్పారని కానీ ఇంతవరకు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో 17 లక్షల మంది అర్హులు ఉన్నారని ఈ 16 నెలల్లో ఒక్కొక్కరికి 64వేల రూపాయలు చొప్పున చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఈ విధంగా ఎస్సి.ఎస్టి.బీసీ.ముస్లిం మైనారిటీలను నమ్మించి మోసగించిందని కూటమి ప్రభుత్వంపై ఆయన విమర్శించారు.ఇప్పటికైనా వట్టి  మాటలు కట్టిపెట్టి వచ్చే నవంబర్ 1 నుంచి ప్రధానమైన ఈ మూడు హామీలను అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు పోరుమామిళ్ల మండల శాఖ అధ్యక్షుడు డాక్టర్ అన్వర్. మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముజాహిద్. సలావుద్దీన్.రఫీ. ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments