ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారిని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్) రాష్ట్ర ప్రతినిధి బృందం కలిసింది. పూల బొకే ను అందజేసి శాలువాతో సత్కరించింది. యూనియన్ కార్యకలాపాలతో పాటు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, యూనియన్ ఫౌండర్ ఛైర్మన్ ఉప్పల లక్ష్మణ్. ఈ మేరకు వినతిపత్రంను సమర్పించారు. గవర్నర్ ను కలిసిన ప్రతినిధి బృందంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వి.సూర్యనారాయణ రెడ్డి, వి సత్యనారాయణ రాష్ట్ర ఉపా అధ్యక్షులు కార్యదర్శి బి. నాగేశ్వరరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ లు కె. నరసింహారావు, శివకుమార్ లు ఉన్నారు.
0 Comments