వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల: విద్యుత్తు కనెక్షన్ కట్ చేశారు. సర్వీస్ ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తొలగించాలని విద్యుత్ స్తంభానికి నోటీసు కట్టారని. నాపై కక్ష సాధింపుతో తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యుత్ శాఖ అధికారులను లోబర్చుకొని ఇబ్బందులు పెట్టాలని ఉద్దేశంతో విద్యుత్ కనెక్షన్ తొలగించడమే కాక ట్రాన్స్ఫార్మర్ కూడా తొలగించాలని కుట్రబడుతున్నారని. అదేవిధంగా గుర్రప్ప స్వామి దేవస్థానం దగ్గర సగిలేరు ఒడ్డున ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా దాదాపు 40 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను బిగించారని. అవి తెలుగుదేశం పార్టీ నాయకులకు. విద్యుత్ శాఖ అధికారులకు కనిపించలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి అధికారులపై మండిపడ్డారు. గురువారం వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి హయాంలో 1993 సంవత్సరంలో సర్వే నంబర్ 1193. సర్వేనెంబర్ 1194 లో తన భూమిలో ప్రభుత్వ అనుమతితో 26331130003372 సర్వీస్ నెంబర్ గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను బిగించారని ఆయన ఆరోపించారు. కానీ నా పొలంలో బిగించిన ట్రాన్స్ఫార్మర్ అక్రమంగా బిగించానని ఆ ట్రాన్స్ఫార్మర్ రంగసముద్రం చెరువు లో తొట్టిన ఉందని దానిని తొలగించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు నాపై కక్ష సాధింపుతో కుట్రపడి విద్యుత్తు శాఖ అధికారులను లోపర్చుకొని నా ట్రాన్స్ఫార్మర్ ను ఎట్టకేలకు తొలగించాలని పట్టు పడ్డారని ఆయన ఆరోపించారు. రాజకీయ నాయకులకు కొమ్ముకాస్తున్న విద్యుత్తు శాఖ అధికారులు నాకు నోటీసులు జారీ చేయకుండా నా పొలములో ఉన్న విద్యుత్ స్తంభానికి నోటీసులు కట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగసముద్రం పంచాయతీలోని రెడ్డినగర్ లో నివాసం ఉన్నా వ్యక్తినని. రాజకీయంగా అందరికీ తెలిసిన వ్యక్తిని అయినా కూడా నాకు నోటీసులు ఇవ్వకుండా. విద్యుత్తు స్తంభానికి నోటీసు కట్టడం సరైన పద్ధతి కాదని ఆయన అధికారులపై మండిపడ్డారు. రంగసముద్రం పంచాయతీలోని గుర్రప్ప స్వామి దేవస్థానం దగ్గర సగిలేరు ఒడ్డున అనుమతి లేకుండా అక్రమంగా దాదాపు 40 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు బిగించారని. ఆ ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు తొలగించలేదు.. అధికారులకు అనిపించలేదా.. లేక కనిపిస్తే ఆ ట్రాన్స్ఫార్మర్లు అధికార పార్టీ నాయకులకు సంబంధించినవి కాబట్టి పట్టించుకోవడం లేదా.. లేక రాజకీయాలు అడ్డొస్తున్నాయా అని ఆయన ప్రశ్నించారు. సగిలేరు ఒడ్డున అక్రమంగా బిగించిన ట్రాన్స్ఫార్మర్లు. విద్యుత్ వైర్లు క్రింది భాగంలో వేలాడుతున్నాయని. వాటి వల్ల గురప్ప స్వామి దేవస్థానానికి వచ్చిన భక్తులకు. పశువుల కాపర్లు భయభ్రాంతులకు గురవుతున్న విషయం అధికారులకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. సగిలేరు ఒడ్డున అక్రమంగా బిగించిన విద్యుత్ వైర్ల ద్వారా గతంలో ప్రమాదాలు జరిగిన సంఘటనలు అధికారులు మర్చిపోయారా అని ఆయన గుర్తు చేశారు. అక్రమంగా బిగించిన విద్యుత్ సౌకర్యాన్ని తొలగించవలసిన అధికారులు భక్తులు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రదేశంలో విద్యుత్తు సౌకర్యము కల్పిస్తున్నారని ఆయన అధికారులపై ద్వజమెత్తారు. ఈ విషయంపై కడప జిల్లా విద్యుత్ శాఖ ఎస్ సి.ఈఈ. మరియు మైదుకూరు డి ఈ. పోరుమామిళ్ల ఏడిఏ. అధికారులకు ఫిర్యాదు చేశానని ఆయన అన్నారు. ఏది ఏమైనా సగిలేరు ఒడ్డున అక్రమంగా బిగించిన విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
0 Comments