google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 సీఎం చంద్రబాబు ను కలిసిన టిడిపి యువ నాయకులు చెరుకూరి రవికుమార్...

సీఎం చంద్రబాబు ను కలిసిన టిడిపి యువ నాయకులు చెరుకూరి రవికుమార్...

కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు చెరుకూరి రవికుమార్. టిడిపి నాయకులు రంగసముద్రం మాజీ సర్పంచ్ కల్వకూరి నడిపి వెంకటసుబ్బయ్య. తదితర నాయకులు మంగళవారం అమరావతి సచివాలయంలో ని సీఎం ఛాంబర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చెరుకూరి రవికుమార్ మాట్లాడుతూ
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ  కార్యకర్తల సమస్యను చంద్రబాబు నాయుడు  దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. అదేవిధంగా బద్వేల్ నియోజకవర్గం లోని పోరుమామిళ్ల పట్టణం నందు రవాణా ఎక్కువ రద్దీగా ఉండటం వలన  బైపాస్ రోడ్డు వేస్తున్నారని. ఆ రోడ్డును పరిశీలించవలసిందిగా ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఆయన అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్ రావడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టమని చెప్పినట్లు ఆయన అన్నారు.



 

Post a Comment

0 Comments