వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల: కొన్ని రోజుల నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయని. ఈ వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోరుమామిళ్ల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. శ్రీనివాసులు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. శ్రీనివాసులు మాట్లాడుతూ పోరుమామిళ్ల మండలం లోని పోలీస్ సర్కిల్ పరిధికి సంబంధించిన కలసపాడు. పోరుమామిళ్ల. కాసినాయన మండల లోని ప్రజలు జాగ్రత్త ఉండాలన్నారు. అదేవిధంగా కురుస్తున్న వర్షాల కారణంగా పాత ఇళ్ళు, మట్టి మిద్దెలు పడిపోవటానికి అవకాశాలు ఉన్నాయని. అందువల్ల ఏమైనా జరగడానికి సంఘటనలు జరుగుతాయని ఆయన అన్నారు. అలాంటి ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు దయచేసి అక్కడ ఖాళీ చేసి మీకు దగ్గరలోని సురక్షితమైన ప్రదేశంలో ని ఇళ్లలో ఉండాలని ఆయన కోరారు.
అదేవిధంగా ఇళ్ల దగ్గర కానీ, పొలాల దగ్గర కానీ తడి చేతులతో లేక తడి బట్టలతో కరెంటు ఆన్, ఆఫ్ చేయడం ప్రమాదకరమని అలాగే ఎక్కడైనా వంకలు, వాగులు దాటేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాల బారిన పడకుండా ఉండాలన్నారు. ఏమైనా పోలీసుల సహాయార్థం కోసం 9121100630 ఈ నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు.
0 Comments