google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 బద్వేల్ మున్సిపాలిటీలో ఫ్రైడే ఫ్రైడే లో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ వి.వి నరసింహారెడ్డి..

బద్వేల్ మున్సిపాలిటీలో ఫ్రైడే ఫ్రైడే లో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ వి.వి నరసింహారెడ్డి..

వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని భావనారాయణ నగర్ సచివాలయం పరిధిలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో బద్వేలు మున్సిపల్ కమిషనర్ వి.వి నరసింహారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కమీషనర్ వి.వి నరసింహారెడ్డి మాట్లాడుతూఎక్కడైనా నీరు నిల్వ వుండే పాత డ్రమ్ములు, పాత టైర్లు వుంటే తక్షణమే తొలగించుకోవాలని ఆయన తెలిపారు.
పాత టైర్లు బయట వేయడం ద్వారా అందులో  నీరు నిల్చి దోమలార్వ వృద్ధి చెంది డెంగ్యూ, చికెన్ గుణ్య. కారక టైగర్ దోమలు ఉత్పత్తి అవుతాయన్నారు. వాటి ద్వారా డెంగ్యూ, చికెన్ గున్య లాంటి జ్వరాలు వ్యాప్తి చెంది ప్రజారోగ్యాన్ని నష్టం కలుగుతుంది. కావున పాత టైర్ లు ఎక్కడైనా వుంటే  తొలగించాలని ఆయన అన్నారు.వర్షాకాలం ప్రతి ఒక్కరు మిద్దలపైన సన్సైడ్ లలో తూములకు ఆకులు అడ్డుపడి నీరు నిల్వ ఉండే అవకాశము ఉన్నందున తొలగించడం, రోళ్లు, పాత కుండలు, పచ్చి టెంకాయలు, నీటితొట్లు మొదలుగు వాటిలో నీరు నిల్వ లేకుండా చూసుకొని మీ పరిసరాలు, ఇంటి ఆవరణంలో చుట్టూ పక్కల ప్రదేశాలు పరిశుభ్రంగా వుంచుకోవాలాన్నారు కమిషనర్ నరసింహారెడ్డి.కాచిచల్లార్చిన నీరు త్రాగడం వలన సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో కమీషనర్ గారితో పాటు హెల్త్ సెక్రెటరీ, శానిటేషన్ సెక్రటరీ లు,ఆశ వర్కర్ లుమరియు ప్రజారోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

        

Post a Comment

0 Comments