google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 తమిళ పెరటాసీ మాసం మూడవ శనివారం సందర్భంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బేటారాయస్వామి కొండకు పోటెత్తిన జనం..

తమిళ పెరటాసీ మాసం మూడవ శనివారం సందర్భంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బేటారాయస్వామి కొండకు పోటెత్తిన జనం..

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బేటారాయస్వామి కొండపై కొలువున్న శ్రీ పేటరాయ స్వామి వారిని దర్శించుకోవడానికి. తమిళ పెరటాసీ మాసం మూడవ శనివారం సందర్భంగా కుప్పం ప్రాంతం ప్రజలే కాకుండా సరిహద్దు ప్రాంతాలైన  తమిళనాడు, కర్ణాటక నుండి ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ సింహ  మాట్లాడుతూ  ప్రతి సంవత్సరంఆవరణలో బేటారాయ స్వామి కొండ దిగువున  టిటిడి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 
టిటిడి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కమనీయంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు‌. స్వామివారి కల్యాణాన్ని చూడటానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు.  ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం టిటిడి బోర్డు మెంబర్ శాంతారామ్ మరియు టిడిపి ముఖ్య నేతలు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments