సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై దాడి. భారత రాజ్యాంగం పైన దాడి చేసిన మతోన్మాది అయిన న్యాయవాది రాకేష్ కిషోర్ ని శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ని అంబేద్కర్ సర్కిల్ లో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ మెంబర్ ఎస్, చంద్రశేఖర్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చాంద్ బాషా, దళిత ప్రజా సంఘాల నాయకులు జకరయ్య, పిచ్చయ్య, కేశవ, జుట్టు నారాయణ లు మాట్లాడుతూ అత్యున్నత స్థాయికి ఎదిగిన ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దళిత మేధావి ని బి ఆర్ గవాయ్ ఎదుగుదలను మతోన్మాదులు సహించలేకపోతున్నారని అందులో భాగంగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడి చేశారని ఇది భారత ప్రజాస్వామ్యం రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని వారు ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైనే ఇలాంటి దుర్మార్గపు దాడులకు పాల్పడుతుంటే ఇక సామాన్య ప్రజా దళితులపై ఏ రక్షణ ఉంటుందో అర్థం చేసుకోవాలని వారు ఆరోపించారు సుప్రీంకోర్టు సి జె ఐ గవాయి పై దాడి చేసిన 71 ఏళ్ల న్యాయవాది రాకేష్ కిషోర్ మరో గాడ్సేనా, భారతదేశానికి పాకిస్తాన్ టెర్రరిస్టుల కన్నా చాలా ప్రమాదకరమని తక్షణమే రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు బిజెపి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ ఆగడాలు ఎక్కువైపోయాయని ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు నిర్ణయించడం సిగ్గుచేటు అన్నారు స్వాతంత్రం రాకముందు మతోన్మాదులు సనాతన ధర్మం ఎక్కడుందని స్వాతంత్రం కన్నా ముందు దళితులు ముస్లింలు కోసం రాజ్యాంగ హక్కుల కోసం పర్యవేక్షణ కోసం పెద్ద ఎత్తున గుర్తు చేశారు కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ బిజెపి ప్రభుత్వం ఉన్మాది అయిన రాకేష్ కిషోర్ ను వెనకేసుకొచ్చి న్యాయవ్యవస్థలో వాదించే దానికి లేకుండా సభ్యత్వం రద్దు చేశామని చెప్పడం కంటి చూపు చర్య అని న్యాయమూర్తి బి ఆర్ గవాయి పై దాడి ప్రపంచ దళిత రాజ్యాంగం పై దాడి అని భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ జిల్లా కమిటీ సభ్యులు కే, జకరయ్య బి, అనిల్ ఏరియా కమిటీ సభ్యులు రామరాజు, జయరామరాజు, విజయ రావు, మహబూబ్ బాషా, చంద్రపాల్, నారాయణ,శివరాం, సిపిఎం డివైఎఫ్ఐ దళిత ప్రజా సంఘాల నాయకులు చిన్ని, షరీఫ్, నాగేంద్రబాబు తదితర నాయకులు పాల్గొన్నారు
0 Comments