వైయస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డి పల్లి గ్రామ రెవెన్యూ పొలంలోని చీటీపాయలో పేదలు సాగు చేసుకుని అనుభవంలో ఉన్న భూములకు సాగు పట్టాలు ఇవ్వాలని మండలంలో అసైన్మెంట్ ద్వారా కాకుండా ఆన్లైన్ చేయించుకున్న భూములను రద్దు చేయాలని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మంగారిమఠం మండల తాహసిల్దార్ వారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కమిటీ సభ్యులు హరి, సుబ్బమ్మ, అజయ్ మాట్లాడుతూ
బి.మఠం మండలం సోమిరెడ్డి పల్లి గ్రామ రెవెన్యూ పొలం చీటీపాయలో ఆరు సంవత్సరాల క్రితం సోమిరెడ్డిపల్లె, మద్దిరెడ్డి పల్లె, గొల్లపల్లి గ్రామాల్లోని దాదాపు 150 మంది అసైన్మెంట్ లబ్ధిదారులు భూమిలేని పేదలు సర్వే నంబర్ 815 నుండి 840 వరకు ఉన్న సర్వే నెంబర్లతో పాటు మరికొన్ని సర్వే నెంబర్లలో ఐక్యంగా 2 సంవత్సరాల పాటు పోరాటం నిర్వహించి అసైన్డ్ మరియు ప్రభుత్వ భూమిలో అమూదాలు, ఉలవ పంటలను పండించారని గత 6, సంవత్సరాలుగా ఆ భూములను తమ ఆధీనంలో ఉంచుకొని ఉన్నారని వారు గుర్తు చేశారు. పేదలకు చెందాల్సిన భూముల మీద కొంతమంది పెద్దల కన్ను పడిందని ఇప్పటికే ఒకరిద్దరూ ఆ భూముల్లో రాత్రికి రాత్రి బోర్లు వేశారని మరి కొంతమంది వాటిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. కొంతమంది రెవెన్యూ అధికారుల క్రింది స్థాయి సిబ్బంది ప్రమేయంతోనే అలా జరుగుతుందని వారు ఆరోపించారు. పేదలకు చెందాల్సిన భూములలో ఎటువంటి రికార్డ్స్ పుట్టిన దాని బాధ్యత రెవిన్యూ అధికారులదేనని వారన్నారు. మండలంలోని అనేక పంచాయతీలలో అసైన్మెంట్ లబ్ధిదారులు తమ భూముల ఆన్లైన్ కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న వారిని పట్టించుకోకుండా అసైన్మెంట్ లబ్ధిదారులు కాని వారికి నకిలీ పాస్ బుక్ లను సృష్టించిన వారికి అప్పనంగా పేదల భూములను ఆన్లైన్ చేశారని వెంటనే వాటిని రద్దు చేయాలని అసైన్మెంట్ లబ్ధిదారులకు భూములను సర్వే చేసి చూపాలని పేదల అనుభవంలో ఉన్న భూములకు సాగు పట్టాలు మంజూరు చేయాలని పేదల భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
0 Comments