google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 స్వచ్ఛమైన గాలి భావి తరాలకు అందించడం మనందరి కర్తవ్యం...

స్వచ్ఛమైన గాలి భావి తరాలకు అందించడం మనందరి కర్తవ్యం...

వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శనివారం పోరుమామిళ్ల మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కో ఆర్డినేటర్ బోవిల్ల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బొటానికల్ గార్డెన్ లో మొక్కలు నాటి తర్వాత క్యాంపస్ క్లీనింగ్ చేశారు. డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సగిలి ప్రకాష్ రావు  మాట్లాడుతూ విద్యార్థులు కాలుష్య రహిత గాలి వలన ఆరోగ్యానికి ప్రయోజనాలు గురించి
ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ సులోచన, డాక్టర్ వెంకట రావు, హరిబాబు, యంబడి ఈశ్వరయ్య, శ్రీనివాసులు, పర్వీన్, గురమ్మ, మల్లిఖార్జున, రవిచంద్ర మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments