వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల: దీపావళి పండుగ సందర్భంగా పోరుమామిళ్ల సర్కిల్ ఫరిధి లోని ప్రజల భద్రత కోసం క్రింది సూచనలు పాటించాలని పోరుమామిళ్ల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ
1.ప్రభుత్వ అనుమతి ఉన్న వారు మాత్రమే టపాసుల స్టాళ్లు/దుకాణాలు ఏర్పాటు చేయాలి. లైసెన్స్ లేకుండా టపాకాయలు అమ్మినట్లయితే కేసు నమోదు చేయబడును.
2. అధికారులు నిర్ణయించిన ప్రదేశాల్లోనే స్టాల్లు ఏర్పాటు చేయాలి. ఇళ్లల్లో, నివాస ప్రదేశాల వద్ద అమ్మరాదు
3.టపాసులు అధికారిక లైసెన్స్ కలిగిన తయారీదారుల నుండి మాత్రమే కొనుగోలు చేసి అమ్మాలి.
4.నాణ్యత లేని లేదా నకిలీ పటాకులు విక్రయించరాదు.
5.స్టాళ్ల వద్ద ఫైర్ ఎక్స్టింగ్విషర్, నీటి బకెట్లు, ఇసుక బస్తాలు తప్పనిసరిగా ఉంచాలి.
6.దుకాణం వద్ద పొగ త్రాగడం, అగ్ని వెలిగించడం పూర్తిగా నిషేధించాలి.
7.టపాసుల ప్యాకెట్లపై తయారీదారు పేరు,ఎం ఆర్ పి. సేఫ్టీ సూచనలు ఉండేలా మాత్రమే విక్రయించాలి.
8.టపాసులు అమ్మే స్టాల్లల్లో చిన్న పిల్లల తో పని చేయించరాదన్నారు. అదేవిధంగా
వినియోగదారులు పలు నిబంధనలను పాటించాలన్నారు.
1. ఎల్లప్పుడూ లైసెన్స్ ఉన్న దుకాణాల నుండి మాత్రమే పటాకులు కొనుగోలు చేయాలి.
2. చిన్నారులు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పటాకులు కాల్చాలి
3. టపాసులు కాల్చేటప్పుడు నీటి బకెట్ లేదా ఇసుక దగ్గర ఉంచాలి.
4. టపాసులు కాల్చేటప్పుడు కాటన్ బట్టలు ధరించడం మంచిది, నైలాన్ వస్త్రాలు తప్పించాలి.
5. టపాసులు రోడ్లపై, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కాల్చకూడదు.
6. టపాసులు కాల్చేటప్పుడు జంతువుల దగ్గర, ఆసుపత్రులు, పాఠశాలలు వద్ద కాల్చకుండా జాగ్రత్త పడాలని ఆయన అన్నారు.
ప్రజలందరూ సురక్షితంగా, ఆనందంగా. సంతోషంగా దీపావళి జరుపుకోవాలని ఆయన కోరారు.
0 Comments