google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్ నీటమునిగిన దృశ్యం..

పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్ నీటమునిగిన దృశ్యం..

గతంలో ఉన్న పంట  కాలువల కబ్జాలే  కారణం!

వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మి నారాయణ రెడ్డి.

వైయస్సార్ కడప. జిల్లా పోరుమామిళ్ల: కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోరుమామిళ్ల
పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ చుట్టుకొమ్ముకుని వర్షపు నీళ్ళు నిల్వ ఉన్నాయంటే దీనికి కారణం పోరుమామిళ్ల పెద్ద చెరువు నుండి రంగసముద్రం చెరువుకు వెళ్ళవలసిన ఆర్టీసీ బస్టాండు దగ్గర దగ్గర ఉన్న వంటకాలవ ఆక్రమణకు గురి కావడంతో వర్షాలు వస్తే వర్షం నీటితో పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్ నీటితో చెరువుల తలపిస్తూ. ఒకవైపు ప్రయాణికులకు. మరో వైపు ప్రజలు ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడిందని. వైస్సార్సీపీ జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మి నారాయణ రెడ్డి
 ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్ మొత్తం నీటితో నిండిపోయింది. ఈ పరిస్థితికి కారణం గతంలో ఈ ప్రాంతం మొత్తం వరి మగాని ఉండగా, ఇప్పుడు ఆ భూభాగంలో అనధికారికంగా నిర్మాణాలు చేసిన టీడీపీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెరుకూరి చెన్న రాయుడు. పూర్వం ఈ ప్రాంతం నుండి వర్షపు నీరు వెళ్లడానికి ఉన్న 22 అడుగుల వెడల్పైన పంట కాలువను కబ్జా చేసి, దాని మీద గదులు, కాంప్లెక్సులు నిర్మించడం వల్ల నీరు వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయిందని ఆయన ఆరోపించారు.దీని కారణంగా రంగసముద్రం పంచాయతీ పరిధిలోని రెడ్డినగర్, గిరినగర్ మరియు పరిసర ప్రాంతాల నుండి వచ్చే వర్షపు నీరు ఇప్పుడు ఆర్టీసీ బస్టాండ్ వద్దే నిలిచిపోతున్నాయన్నారు.గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ  గోవింద రెడ్డి చొరవతో.రంగసముద్రం పంచాయతీ సర్పంచ్ చిత్తారవి ప్రకాష్ రెడ్డి చొరవతో పెద్ద వర్షాల సమయంలో జెసిబి ఉపయోగించి కాలువలు శుభ్రపరిచి నీటిని చెరువులోకి మళ్లించే చర్యలు తీసుకున్నారు.
ఇప్పుడేమో అలాంటి చర్యలు లేవు. కొన్ని నెలల క్రితం ఇదే సమస్యపై వైయస్సార్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్. మరియు బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ కు వినతిపత్రాలు అందజేసినా, ఎటువంటి స్పందన లేదని ఆయన ఆరోపించారు. 
ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ప్రజలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని, తక్షణ చర్యలు తీసుకుని కాలువలను పునరుద్ధరించి, వర్షపు నీటి ప్రవాహానికి మార్గం కల్పించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు. మరియు ప్రజలు కోరుతున్నారు

Post a Comment

0 Comments