బద్వేలు ప్రాంతప్రజలు కడపతో
వారిజీవన విధానం ముడిపడి ఉన్నది
అంతేకాకుండ కాశీనాయన మండలం నుండి ప్రజలు వారిసమస్యలపరిష్కారం కొరకు జిల్లాకు పోవాలంటే ప్రస్తుతం తొంబై కిలోమీటర్లైతే జిల్లాకు చేరుకోవచ్చు.అదే రాజంపేట ఐతే దాదాపు నూటాఅరవైఐదు కిలోమీటర్లదూరం ప్రయాణించ వలసిఉన్నది ఇదిప్రధానమైనసమస్య
అలాగే సిద్దవటంమద్యలో ఫారెస్టు గేటు ఉన్నది కడపఅభివృద్ది చెందుతున్న జిల్లాకనుక పరిపాలన విద్య వైద్యం ఉపాది విషయంలో ను రవాణా సౌలభ్యంలోను కడపఐతే ఈప్రాంతప్రజలకు అనుకూలంగా ఉంటుంది అలాగేఆధారుకార్డుఆధారంగాబతుకుతున్నఈప్రాంత ప్రజలు మళ్ళీఆధారు కార్డులను అంటే ప్రభుత్వపథకాల అమలువిషయంలో
గందరగోళానికి గురికావలసిన పరిస్తితి వస్తుంది. కడపజిల్లా నుండి బద్వేలును విడదీయాలను కోవడం. చాలా దారుణం. దీనికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.ప్రజలను గందరగోళానికి గురిచేసేప్రకటనలు వస్తున్నా ఈప్రాంత కూటమి ప్రభుత్వనాయకులు గాని ప్రభుత్వపెద్దలుగాని స్పందించక పోవడాని గలకారణమేమిటో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.ఒకవేలఏకపక్షనిర్ణయంజరపాలనిచూస్తే బద్వేలునియోజకవర్గ ప్రజలను ప్రజాసంఘాలను అన్నివర్గాలప్రజలను ఏకం చేసి బద్వేలునియోజకవర్గాన్ని కాపాడుకుంటాం ఎటువంటిఆందోళనలకైనాసంసిద్ధమన్నారు.మీరు దళిత నాయకులు చెనరాయుడు వివిధ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.బద్వేలు నియోజకవర్గం పేరుకే ఎస్సీ నియోజకవర్గం కానీ పెత్తనం అంతా అగ్రవర్ణాలదేనని, వారన్నారు. బద్వేలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందకుండా మరో 20 ఏళ్లు వెనక్కినట్టే ప్రయత్నం పాలకులు చేస్తున్నారని, అలాంటి ప్రయత్నం విరమించుకోవాలని లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదు అన్నారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గసభ్యులు పి బాలు ,సిపిఐబద్వేలునియోజకవర్గకార్యర్శి పిడుగుమస్తాన్.దళితనాయకులు నారాయణ అృబేడ్కర్ విగ్రహకమిటి నాయకులు యన్ చెండ్రాయుడు, డి బిఎఫ్ నాయకులు చిన్నయ్య, దళిత సీనియర్ నాయకులు ఓ వి ఎస్ ప్రసాద్, దళిత నాయకులు కూకట్పల్లి మురళి, తిరుపాల్, బీసీ సంఘం నాయకులు కత్తి బ్రహ్మయ్య, డప్పు కళాకారుల సంఘం జిల్లా నాయకులు పడిగా వెంకటరమణ, సిపిఐ జిల్లా సమితి సభ్యులు నల్లిపోగు నాగేశం, వృత్తిదారుల సంఘం నాయకులు నాగరాజు, ఏఐవైఎఫ్ నాయకులు భరత్ ,మునిరత్నం, మహిళా సంఘం నాయకులు విజయమ్మ, గోపవరం మండల కార్యదర్శి గూడూరు పెంచలయ్య, డి హెచ్ పి ఎస్ నాయకులు ఓబులేసు,ఏఐటీయూసీ నాయకులు ఇర్ల నాగేష్, జి ఎల్ నరసింహ, నాయకులు సుబ్బారెడ్డి వెంకటేష్ సుధాకర్ ప్రసాద్ వివిదప్రజాసంఘాల మరియు సిపిఐపార్టి నాయకులు పాల్గొన్నారు.
0 Comments