వైయస్సార్ కడప జిల్లా కలసపాడు మండల మండలంలోని వ్యవసాయ శాఖ అధికారిగా విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. గతంలో వ్యవసాయ అధికారి ప్రసాద్ రెడ్డి మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కడప కు ఓడి బేసిస్ మీద వెళ్లిపోవడం తో ఈ మేరకు జిల్లా ఉన్నత అధికారులు విజయ్ కుమార్ ను కలసపాడు మండల ఏవో గా నియమించారని. రైతులకు అందుబాటులో ఉండి గ్రామీణ ప్రాంతాల సైతం రైతుల సమస్యలను పరిష్కరిస్తానని వ్యవసాయ శాఖ అధికారి విజయ్ కుమార్ పేర్కొన్నారు. అదేవిధంగా మంగళవారం కలసపాడు మండలంలోని సిద్ధ మూర్తిపల్లె గ్రామంలో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారి విజయ్ కుమార్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వరి పంటలో ఈ సమయం వచ్చే మాని పండు తెగులు గమనించి దాని గాను కార్బన్ నిజం 2 గ్రామ్ లైట్ లేదా. కాపర్ ఆక్సి క్లోరైడ్ 2.5 గ్రామ్ లైట్ పిచికారి చేసుకోమని తెలుపమని ముందస్తు చర్యల్లో భాగంగా విత్తన శుద్ధి చేసిన విత్తనాలు నాటుకోమని రసాయన ఎరువులు వాడకం తగ్గించే ప్రకృతి వ్యవసాయ పద్ధతుల పైన దృష్టి సారించాలని రైతులకు తెలియజేశామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కలసపాడు వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.
0 Comments