google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 గల్ఫ్ లో జనసేన పార్టీ కన్వీనర్లను మర్యాదపూర్వకంగా కలిసిన శీలంశెట్టి లక్ష్మయ్య..

గల్ఫ్ లో జనసేన పార్టీ కన్వీనర్లను మర్యాదపూర్వకంగా కలిసిన శీలంశెట్టి లక్ష్మయ్య..

వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల: గల్ఫ్ దేశంలోని జనసేన పార్టీకి చెందిన కన్వీనర్లను. మరియు జాతీయ స్థాయి నాయకులను పోరుమామిళ్ల జనసేన పార్టీ మండల అధ్యక్షులు శీలంశెట్టి లక్ష్మయ్య మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శీలం శెట్టి లక్ష్మయ్య మాట్లాడుతూ గల్ఫ్ జాతీయ కన్వీనర్ రాంచందర్ నాయక్, గల్ఫ్ జాతీయ కన్వీనర్ కంచన శ్రీకాంత్, కువైట్ జనసేన పార్టీ కన్వీనర్ పగడాల అంజన్ కుమార్ లను ఆయన కలుసుకున్నారని ఆయన అన్నారు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై విస్తృతంగా చర్చించారని గ్రామ, మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం. పార్టీ తరఫున చేసే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.
అదేవిధంగా ఎన్నికల్లో గ్రామస్థాయిలో గెలుపు సాధించాలంటే సేవా కార్యక్రమాలు, ప్రజల సమస్యలపై ఉద్యమం, బూత్ స్థాయిలో టీమ్ వర్క్‌ అత్యంత ముఖ్యమన్నారు. జనసేన పార్టీకి గతంలో చేసిన సేవలకు ప్రజలు ఇచ్చిన స్పందన మాకు పెద్ద బలం. అని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా గల్ఫ్ దేశంలోని నాయకులకు మండల రాజకీయ పరిస్థితులు, పార్టీ బలం, స్థానికంగా ప్రజల్లో ఉన్న నమ్మకం గురించి వివరించినట్లు ఆయన అన్నారు. రాబోయే ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్తలు ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయనకు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు. పాల్గొన్నారు.

Post a Comment

0 Comments