google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 పిడుగుపల్లి. పుల్లారెడ్డిపల్లి గ్రామాలలో పొలంపిలుస్తుంది కార్యక్రమం.

పిడుగుపల్లి. పుల్లారెడ్డిపల్లి గ్రామాలలో పొలంపిలుస్తుంది కార్యక్రమం.

వైయస్సార్ కడప జిల్లా. కలసపాడు మండలంలోని పిడుగుపల్లి. పుల్లారెడ్డిపల్లి గ్రామాలలో పొలము పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ రబీ సీజన్లో వేసుకొనే ప్రతి పంటను కచ్చితంగా ఈ పంటనమోదు చేసుకోవాలని. అదేవిధంగా అధిక యూరియా వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం పద్ధతులు ఆచరించి ఆరోగ్యకరమైన పంటలు పండించుకోవాలని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి విజయ కుమార్ మాట్లాడుతూ రైతును రాజు చేయడమే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. అదేవిధంగా తక్కువ పెట్టబడితో ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాలు సాగుచేసుకోవాలని రైతులకు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు హర్ష. సునీల్ పాల్గొనారు.

Post a Comment

0 Comments