వైయస్సార్ కడప జిల్లా కలసపాడు మండలంలోని దూలంవారిపల్లి ఎస్సీ కాలనీలో ని ఆర్ సి ఎం చర్చిలో క్రిస్మస్ పర్వదిన వేడుకలను అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ నియోజకవర్గ వైయస్ఆర్సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి హాజరయ్యారు.ముందుగా తెల్లపాడు మెయిన్ రోడ్డు నుండి ఆర్ సి ఎం చర్చి వరకు బాణాసంచా పేలుస్తూ.డప్పు వాయిద్యాలతో భారీ ర్యాలీగా నాయకులు. మరియు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో విశ్వనాథ రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం కేక్ ను కట్ చేసి స్థానిక క్రైస్తవ సోదరులకు. ప్రజలకు పంచిపెట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలైన ప్రేమ.శాంతి. దయ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, దేవుని అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమములో వైఎస్ఆర్సిపి మండల నాయకులు బోడెద్దుల బాల అంకిరెడ్డి.తెల్లపాడు ఎంపీటీసీ. బి నారాయణరెడ్డి. గూడపు రెడ్డి రామ్మోహన్ రెడ్డి. గ కె హరి. పి పిచ్చి రెడ్డి.సోషల్ మీడియా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె బద్రీనాథ్. లు పాల్గొన్నారు. అదేవిధంగా ఆర్ సి ఎం చర్చి పెద్దలు పోగు ఫ్రాంచెస్.పోలయ్య.పల్లె ఓబులేసు.పోగు లుర్దయ్య. మరియు వైఎస్ఆర్సిపి అభిమానులు.కార్యకర్తలు. పాల్గొన్నారు.
0 Comments