న్యూస్ 21 తెలుగు ఛానల్: రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం లో ”పీఎం రాహత్” పథకంతో గొప్ప ముందడుగు వేసిందని.రోడ్డు ప్రమాద బాధితులకు ఉచితంగా అత్యవసర వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడేందుకు మానవతా నిర్ణయం తీసుకుందని అది బాధితులకు వరం లాంటిదని వైయస్సార్ కడప జిల్లా. బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ. పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అందులో ప్రమాదం జరిగిన వెంటనే గొల్డెన్ అవర్‌లో అత్యవసర చికిత్స
ఎలాంటి రోడ్డు ప్రమాదమైనా 1.5 లక్షల వరకు ఉచిత చికిత్స.ప్రమాదం జరిగిన రోజు నుంచి ఏడు రోజుల వరకు ఉచిత చికిత్స ఉంటుందని. డయల్ 112 ద్వారా ప్రమాద బాధితులకు అంబులెన్స్ సౌకర్యం ఉంటుందని ఆమె తెలియజేశారు.
0 Comments