కడప జిల్లా పోరుమామిళ్ల: రైతాంగాన్ని ఆదుకోవడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని. రైతులను ఆదుకోవాలని సంకల్పంతో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను కల్పిస్తుందని బద్వేలు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితీష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పోరుమామిళ్ల మండలంలోని పంచాయతీ అయిన పుల్లివీడు గ్రామం లో వ్యవసాయ శాఖ ఏడి మురళీధర్ రెడ్డి. మరియు మండల వ్యవసాయ శాఖ అధికారి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వర్క్ షాప్ రైతు సేవ కేంద్రం లో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేలు నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితీష్ రెడ్డి.పోరుమామిళ్ల సింగల్ విండో అధ్యక్షులు కృష్ణ రెడ్డి. మరియు స్థానిక సర్పంచ్ రఘురామి రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా బద్వేల్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితీష్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామాల సైతం రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో రైతులకు అన్ని విధాలుగా ప్రాధాన్యతను కల్పిస్తు ఆదుకుంటుందని ఆయన అన్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ ఏడి మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతను ఈస్తూ పంచ సూత్రాలని ప్రవేశపెట్టిందని అందులో భాగంగా ప్రతి ఎకరాకు నీటి భద్రత మరియు డిమాండ్ ఆధారిత పంటలు అధిక ప్రాధాన్యత. మరియు సాగుకు టెక్నాలజీ జోడింపు. మరియు ఫుడ్ ప్రాసెసింగ్ కు అధిక ప్రాధాన్యత మరియు రైతులు పండించే వివిధ రకాల పంటల ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడం ప్రాధాన్యతగా తీసుకోవడం జరిగిందన్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారి చంద్ర మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాముఖ్యత కల్పిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే దిశగా రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతుల గడప గడపకు వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా రైతులకు వ్యవసాయ శాఖ అందించే వివిధ రకాల పథకాలు గురించి క్లుప్తంగా వివరించడం జరిగినదని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సేవ కేంద్రాల సిబ్బంది గురుమహేశ్వరి. రైతులు వ్యవసాయశాఖ సిబ్బంది. మరియు రైతులు పాల్గొన్నారు.
0 Comments