google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 శ్రీరామ శోభయాత్రలో దురదృష్టవశాత్తు మృతి చెందిన హరి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం.

శ్రీరామ శోభయాత్రలో దురదృష్టవశాత్తు మృతి చెందిన హరి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం.

న్యూస్ 21 తెలుగు ఛానల్: కడప నగరంలో జరిగిన శ్రీరామ శోభయాత్ర లో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన హరి. కుటుంబానికి శ్రీరామ అయోధ్య ఆలయ కమిటీ స్థానిక నేతలు అండగా నిలిచారు. హరి నివాసానికి వెళ్లిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి. లు ఆలయ కమిటీ తరపున 10 లక్షల రూపాయలను ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఆర్థిక సాయంగా మొత్తం రూ. 10 లక్షలలో  5 లక్షలను భవిష్యత్తు అవసరాల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్  ఎఫ్ డి చేయగా, మిగిలిన 5 లక్షలను నగదు రూపంలో తక్షణ అవసరాల కోసం అందజేశారు.ఉపాధి భరోసాగా హరి. భార్యకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే మాధవి రెడ్డి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి. లు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో శ్రీ రామ అయోధ్య రామయ్య కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments