google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 తిరుమల లడ్డు నెయ్యి లో జంతువుల కొవ్వు లేదు... తేల్చి చెప్పిన సీబీఐ సిట్..

తిరుమల లడ్డు నెయ్యి లో జంతువుల కొవ్వు లేదు... తేల్చి చెప్పిన సీబీఐ సిట్..

న్యూస్ 21 తెలుగు ఛానల్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు వైయస్సార్ కడప జిల్లా. దేవుని కడప లో  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రమైన తిరుమల లడ్డులో ఎటువంటి జంతువుల కొవ్వులు కలపలేదని సీబీఐ సీట్ కోర్టుకి ఇచ్చిన నివేదికలో పొందు పరిచిన సందర్భంగా  రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, మంత్రి లోకేష్ కి శాపం విమోచనం కలగాలని మంచి బుద్ధి ప్రసాదించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథ్ రెడ్డి , మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజాద్ భాష, రాజంపేట పరిశీలకులు కే.సురేష్ బాబు. ఎస్ ఇ సి  మెంబర్ మాసిమా బాబు.నగర మేయర్ పాక సురేష్. డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి.వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు. వైఎస్ఆర్సిపి నాయకులు, మహిళ కార్యకర్తలు వెంకటేశ్వర స్వామి వారికి పాప ప్రక్షాళన పూజలు చేసి టెంకాయలు కొట్టి నిరసన తెలియ జేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కూటమి నేతలు చేసిన నీచమైన విష ప్రచారం పూర్తిగా అసత్యమని కోర్టుకు సమర్పించిన చార్జ్ షీట్‌లో స్పష్టం చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో కడప వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు, జిల్లా విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు. తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments