google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 బి కోడూరు మండలంలో ఘనంగా జరిగిన బద్వేల్ టిడిపి ఇన్చార్జి రితీష్ రెడ్డి జన్మదిన వేడుకలు.

బి కోడూరు మండలంలో ఘనంగా జరిగిన బద్వేల్ టిడిపి ఇన్చార్జి రితీష్ రెడ్డి జన్మదిన వేడుకలు.

వైయస్సార్ కడప జిల్లా. బి కోడూరు మండలంలో ని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఓ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బద్వేల్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితీష్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు. కార్యకర్తలు.అభిమానులు. ప్రజలు కేక్ ను కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొని బద్వేల్ టిడిపి ఇన్చార్జి రితిష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని బి కోడూరు మండలం. మున్నేల్లి గ్రామంలోని ప్రభుత్వ ఆరోగ్య క్లినిక్ లో  హైదరాబాద్ ఎల్ బి ప్రసాద్ ఆస్పత్రి బృందం మరియు వారి వైద్య అధికారులు తిరుపతి రెడ్డి చేతుల మీదుగా దాదాపు 20 మంది పైగా కంటి పరీక్షలను నిర్వహించారు. అనంతరం సగిలేరు సమీపంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులకు స్వెటర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశంపార్టీ బికోడు మండల అధ్యక్షులు ఓ రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ బద్వేల్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితీష్ రెడ్డి జన్మదిన వేడుకలు సందర్భంగా బి కోడూరు మండలం. మున్నెల్లి గ్రామంలోని ప్రభుత్వ ఆరోగ్య క్లినిక్ లో హైదరాబాద్ ఎల్ బి ప్రసాద్ కంటి ఆస్పత్రి బృందంతో వైద్యాధికారి తిరుపతి రెడ్డి చేతుల మీదుగా కంటి పరీక్షలు చేయించమన్నారు. అదేవిధంగా అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న 200 మంది విద్యార్థులకు స్వేటర్లను పంపిణీచేశామన్నారు. బద్వేల్ టిడిపి ఇంచార్జి రితీష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇంకా మరెన్నో జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు. జి రమణారెడ్డి. ఓ రమణారెడ్డి. రామ్మోహన్ రెడ్డి. దుగ్గి రెడ్డి. వెంకట సుబ్బారెడ్డి. శేషారెడ్డి. తిరుపతి రెడ్డి. రాఘవరెడ్డి. సుబ్బారెడ్డి. రైస్ మిల్ రిగ్గిరెడ్డి. తదితర నాయకులతోపాటు కార్యకర్తలు. ప్రజలు. అభిమానులు భారీగా పాల్గొన్నారు.

Post a Comment

0 Comments