google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 మిద్దెల ఎస్సీ కాలనీ వాసులకు స్మశానానికి దారి ఏర్పాటు చేస్తాం..ఎస్సీ కాలనీ ప్రజలు అధైర్య పడవద్దు.బసిరెడ్డి రవీంద్రారెడ్డి..

మిద్దెల ఎస్సీ కాలనీ వాసులకు స్మశానానికి దారి ఏర్పాటు చేస్తాం..ఎస్సీ కాలనీ ప్రజలు అధైర్య పడవద్దు.బసిరెడ్డి రవీంద్రారెడ్డి..

న్యూస్ 21తెలుగు ఛానల్: కాశి నాయన మండలంలోని మిద్దెల గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులకు స్మశానానికి దారి ఏర్పాటు చేస్తామని. ఎస్సీ కాలనీ ప్రజలు అధైర్యపడవద్దని. అధికారులతో చర్చించి ప్రజా సమస్యను పరిష్కార దిశగా కృషి చేస్తానని బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. కాశినాయన మండలం మిద్దెల ఎస్సీ కాలనీలో సుమారు 300 కుటుంబాలు నివసిస్తున్నారు. వారిలో ఎవరైనా మరణిస్తే పంట పొలాల గట్టుమీద, నీటి గుంటల మీద వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని సోమవారం కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేయడంతో పలు వార్త కథనాలు వచ్చాయి. ఈ విషయంపై టిడిపి ఇన్చార్జ్ రితీష్ రెడ్డి ఆదేశాల మేరకు బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి మండల తాసిల్దార్ వెంకటసుబ్బయ్య తో కలసి మిద్దెల గ్రామాన్ని సందర్శించి అక్కడ కాలనీ ప్రజలను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం స్మశానానికి వెళ్లే దారిని ఆయన పరిశీలించారు.
ఎవరైనా మరణిస్తే ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు ఆయనకు విన్నవించుకున్నారు. ఎవరు అధైర్య పడవద్దని  సంబంధిత అధికారులతో చర్చించి మీ సమస్యను పరిష్కార దిశగా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. స్మశానానికి వెళ్లే దారి గురించి విచారణ చేపట్టి వేగంగా తమకు నివేదిక అందిస్తే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తామని అధికారులకు తెలిపారు. వెంటనే స్పందించి స్మశాన సమస్యను తెలుసుకునేందుకు స్వయంగా ప్రజల వద్దకు వచ్చిన రవీంద్రారెడ్డి కి కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఆర్ఐ అమర్నాథ్ రెడ్డి.వీఆర్వో.సర్వేయర్.టీడీపీ నాయకులు పోలిరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments